అంతర్జాతీయం

సౌరశక్తిని నిల్వచేసే వ్యవస్థ ఏర్పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, నవంబర్ 28: సౌరశక్తి వినియోగం నానాటికీ విస్తృతం అవుతున్నందున దాన్ని సమర్థవంతంగా నిల్వ చేసే వ్యవస్థను భారత్ ఏర్పాటు చేసుకోవాలని ఇంధన రంగ పరిశోధకుడు నిత్యనందా సూచించారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునేందుకు సౌరశక్తి ఓ ప్రత్యామ్నాయంగా మారిందని ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’కు చెందిన నందా సింగపూర్‌లో ‘దక్షిణ ఆసియా సవాళ్లు- స్థిరమైన శక్తి మార్పిడిలో అవకాశాలు’ అనే అంశంపై మంగళవారం జరిగిన వర్క్‌షాప్‌లో వివరించారు. సింగపూర్‌కు చెందిన ‘సౌత్ ఆసియన్ స్టడీస్ అండ్ ఎనర్జీ స్టడీస్’ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో నందా మాట్లాడుతూ, విద్యుత్ డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. తక్కువ ఖర్చుతో ఇది అందుబాటులోకి వస్తుందని, ఒక యూనిట్ సౌరశక్తి రెండున్నర రూపాయలకు లభిస్తుందని, నిల్వ సామర్థ్యం పెరిగినపుడు యూనిట్ ధర రూపాయిన్నర లోపే ఉంటుందన్నారు.