అంతర్జాతీయం

పెట్టుబడులతో రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: హైదరాబాద్ నగరానికి పెట్టుబడులతో రావాలని తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అత్యంత స్నేహపూరితమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, అనుమతులపై దేశంలో ఎక్కడాలేని కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలను స్వయంగా కలుసుకోవడంతో పాటు వివిధ చర్చా గోష్టిల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ హైకమిషనర్ హరీందర్ సిద్దుతో భేటీ అయన కేటీఆర్, ఫేస్ బుక్ బృందంతోనూ సమావేశమయ్యారు. అనంతరం ఫ్యూయిల్ ఫర్ స్టార్టప్స్ గ్రంథావిష్కరణలో పాల్గొని నీతిఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్‌తో చర్చలు జరిపారు. తెలంగాణలో విద్యారంగం, గనులు, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో ఆస్ట్రేలియన్ కంపెనీలకున్న పెట్టుబడుల అవకాశాలను ఆస్ట్రేలియా హైకమిషనర్‌కు కేటీఆర్ వివరించారు. ఆస్ట్రేలియా వర్శిటీలకు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరుగుతోందని, వర్శిటీల భాగస్వామ్యంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న గేమింగ్ టవర్, ఈ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ హెడ్ జేమ్స్ హెయిర్స్‌టన్, బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆష్ జవేరి, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంభిదాస్‌లు ఐటి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చ్యువల్ రియాలిటీ, డేటా అనలిటిక్స్ రంగంలో తమ కంపెనీ చేస్తున్న కృషిని మంత్రికి వివరించారు. టి.హబ్‌తో కలిసి ఫేస్‌బుక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపైనా చర్చ జరిగింది. జీఈఎస్ కాన్ఫరెన్స్‌ను అద్భుతంగా నిర్వహించారని వారు కితాబునిచ్చారు. అమెరికా వెలుపల అతిపెద్ద ఆఫీసును ఫేస్‌బుక్ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని, వారు భవిష్యత్‌లో కొత్త విభాగాలను ఏర్పాటు చేయదలుచుకుంటే అందుకు అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ థిల్లై రాజన్ రాసిన ‘్ఫ్యయల్ ఫర్ స్టార్టప్స్’ పుస్తకాన్ని జీఈఎస్ సదస్సులో మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్‌లు ఆవిష్కరించారు. వెంచర్ క్యాపిటల్ రంగంపై రాసిన ఈ పుస్తకం ఇపుడు ఈ రంగంలోకి వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, యువతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పుస్తకం ఆవిష్కరించిన అనంతరం మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌కు అగ్రాసనం
తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ ఇంక్యుబేటర్ టి.హబ్, ప్రముఖ క్యాబ్ షేరింగ్ సంస్థ ఊబర్ కలిసి నిర్వహించిన ఊబర్ ఎక్చ్సేంజి పోటీల విజేతలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అంకుర సంస్థలు ఇందులో పాల్గొనగా, పది
సంస్థలను ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సంస్థలే ఐదు ఉండటం సంతోషదాయకమని మంత్రి కేటీఆర్ అన్నారు. అంకుర సంస్థలకు హైదరాబాద్‌ను స్వర్గ్ధామంలా మార్చేందుకు తెలంగాణ చేస్తున్న కృషికి ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీ తీసుకువస్తుందన్నారు. 24గంటల క్రితం ప్రారంభమైయిన హైదరాబాద్ మెట్రోను మారు మూల ప్రాంతాల కనెక్టివిటీ మెరుగుకు దేశంలోని అన్ని మొబిలిటీ స్టార్టప్‌లు ప్రయత్నించాలని కోరారు. ఊబర్ ఇండియా హెడ్ అమితాబ్ జైన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు రెండో రోజు కార్యక్రమంలో వేదికపై మంత్రి కేటీఆర్, ఇవాంకా ట్రంప్