అంతర్జాతీయం

ఆ రెండే ప్రపంచానికి పెను సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, నవంబర్ 29: ప్రపంచాన్ని నేడు ఉగ్రవాదం, తీవ్రవాదం అనే రెండు ప్రధాన సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, వీటిని అంతం చేసేందుకు భారత్ తన వంతు కృషి చేస్తోందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రష్యాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా మాస్కోలో ఆయన మంగళవారం రాత్రి ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. రష్యాతో స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. భద్రత, ఉగ్రవాదం-తీవ్రవాదం నిర్మూలన, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం, వివిధ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దడం వంటి అనేక అంశాల్లో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారతీయ సైన్యం నిర్వహిస్తున్న పాత్రను ఆయన ఉదహరించారు. తన పర్యటన పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ, రష్యాను భారత్‌కు ‘విశ్వసనీయ స్నేహితుడి’గా అభివర్ణించారు. రష్యాలోని ప్రవాస భారతీయులను సాంస్కృతిక వారధులుగా పేర్కొంటూ, భౌతికంగా వీరు మాతృదేశానికి దూరంగా ఉంటున్నా భావోద్వేగాల పరంగా ఎప్పటికీ దూరం కారని రాజ్‌నాథ్ అన్నారు.
దేశాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను, సంస్కరణలను ఆయన వివరించారు. జన్‌ధన్ యోజన, మేకిన్ ఇండియా, ఆధార్ వంటి కార్యక్రమాల అమలుతో దేశ ఆర్థిక పరిస్థితి శరవేగంగా మెరుగుపడుతోందని తెలిపారు. బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాల సరసన భారత్ త్వరలోనే చేరుతుందన్నారు. మోదీ ప్రభుత్వ మూడున్నరేళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని వివరించారు.