అంతర్జాతీయం

‘లష్కరే’కు అతిపెద్ద అభిమానిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 29: ప్రముఖ ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’కు, ఆ సంస్థ వ్యవస్థాపకుడైన హఫీజ్ సరుూద్‌కు తాను ‘అతిపెద్ద మద్దతుదారు’నని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. కాశ్మీర్‌లో భారతీయ ఆర్మీని అణచివేయడంలో ఉగ్రవాదుల పాత్రను తాను ఎంతగానో అభినందిస్తానని 74 ఏళ్ల ముషారఫ్ ‘ఏఆర్‌వై’ వార్తాసంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. లష్కరే తోయిబాకు తానంటే ఇష్టమన్న సంగతి తనకూ తెలుసునని అన్నారు. 26/11 ముంబయి దాడులకు సూత్రధారి అయిన హఫీజ్ సరుూద్‌ను తానెంతో అభిమానిస్తానని ఆయన తెలిపారు. ‘కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకుంటున్నందుకు’ సరుూద్ అంటే తనకు ఇష్టమన్నారు. నెలల తరబడి గృహనిర్బంధంలో ఉన్న సరుూద్‌ను పాక్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన నేపథ్యంలో ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దుబాయ్‌లో ఉంటూ, 23 రాజకీయ పార్టీలతో ‘మహాకూటమి’ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల ప్రకటించిన ముషారఫ్- జమ్మూ కాశ్మీర్‌లో ‘చర్య’లను, కాశ్మీర్‌లో భారతీయ ఆర్మీని అణచివేయడాన్ని తాను సమర్థిస్తానని తెలిపారు. ‘లష్కరే తోయిబా ఇపుడు ఓ బలమైన శక్తి.. అమెరికాతో పాక్ విభేదించాక ‘లష్కరే’ కార్యకర్తలను ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది.. ఉగ్రవాదులు కాశ్మీర్‌తో ప్రమేయం కలిగి ఉన్నారు.. అయితే- కాశ్మీర్ అంశం పాక్, భారత్‌లకు సంబంధించినది..’ అన్నారు. లష్కరే తోయిబాను అమితంగా అభిమానిస్తున్నట్లు ముషారఫ్ ఇపుడు చెబుతుండగా, నిజానికి ఆయన హయాంలోనే ఆ సంస్థపై నిషేధం విధించారు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా- ‘్భన్నమైన పరిస్థితుల’లో అలా నిషేధించాల్సి వచ్చిందని ఆయన దాటవేశారు. హఫీజ్ సరుూద్‌ను గృహనిర్బంధం నుంచి పాక్ ప్రభుత్వం విడుదల చేశాక, అతడిని తిరిగి అరెస్టు చేయాలని అమెరికా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల జాబితా నుంచి తనపేరును తొలగించాలని సరుూద్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముషారఫ్ సరుూద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. 2008 నవంబర్ 11న జరిగిన ముంబయి పేలుళ్లలో 166 మంది మరణానికి కారకుడైన సరుూద్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా’లో చేర్చు తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి 2008 డిసెంబర్‌లో ఓ తీర్మానం చేసింది.