అంతర్జాతీయం

శభాష్.. ఇవాంక..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుమార్తె, ‘శే్వతసౌధం’ సలహాదారు అయిన ఇవాంకను ప్రశంసలతో ముంచెత్తారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు’ (జీఈఎస్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇవాంక ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని ఆయన కొనియాడారు. భారత పర్యటన సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఇవాంక అద్భుత పనితీరు కనపరుస్తున్నారని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇవాంక భారత్ పర్యటన ఇదే తొలిసారి కానప్పటికీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారుగా ఆమె జీఈఎస్‌లో పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అమెరికా అందజేస్తున్న సహాయ సహకారాల గురించి జీఈఎస్‌లో ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. ఆమె ప్రసంగానికి సంబంధించి స్వల్ప నిడివి గల వీడియాను అమెరికాకు చెందిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్’ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై ట్రంప్ తన వ్యక్తిగత ఖాతాలో ట్వీట్ చేస్తూ ‘గ్రేట్ వర్క్ ఇవాంక’ అని రాసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి నిక్కీ హేలీ కూడా ఇవాంకపై ప్రశంసలు కురిపించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఇవాంక చేస్తున్న కృషి అభినందనీయమని హేలీ ట్వీట్ చేశారు. ట్రంప్ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తొలి ఇండో అమెరికన్ అయిన ఆమె ఇంకా తన ట్వీట్‌లో- ‘ప్రపంచవ్యాప్తంగా మహిళలు శక్తిమంతంగా పనిచేసేందుకు జీఈసీ సదస్సు ఎంతగానో దోహదం చేస్తుంది’ అన్నారు. ఈ ఏడాదే భారత్‌లో పర్యటించాలని తాను భావించినా ఊపిరి సలపని విధుల కారణంగా అది సాధ్యపడలేదని ఆమె పేర్కొన్నారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్’ అధికార ప్రతినిధి హీథెర్ నారెట్ కూడా ఇవాంక ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడేందుకు ఇవాంకను మించిన తగని వ్యక్తి తమ దేశంలో ఇంకెవరు ఉన్నారని నారెట్ వ్యాఖ్యానించారు. జీఈఎస్ సదస్సు నేపథ్యంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ఆమె అన్నారు.