అంతర్జాతీయం

మాకు తిరుగులేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, నవంబర్ 29: ఉత్తర కొరియా, అత్యంత అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం కలిగిన దేశంగా అవతరించిందని అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ సంచలన ప్రకటన చేశారు. తాజా క్షిపణి ప్రయోగ సామర్థ్యంతో ఈ ప్రకటన చేస్తున్నామని అంటూనే, ఇప్పుడు అమెరికాలో ఎక్కడ ఏ లక్ష్యాన్నైనా చేధించగలిగే శక్తిని ఉ.కొరియా పుణికి పుచ్చుకుందని ప్రకటించారు. గత రెండు నెలలుగా ఎలాంటి క్షిపణి పరీక్షలు నిర్వహించకుండా వౌనంగా ఉన్న ఉ.కొరియా, ఆ దేశానికి అంత సీన్ లేదంటూ కొద్ది రోజుల క్రితం ట్రంప్ చేసిన ప్రకటనతో బుధవారం మరో భారీ పరీక్ష నిర్వహించి సవాల్ విసిరింది. బుధవారం ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి విజయవంతం కావడంతో, అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఉ.కొరియా అధికారిక టెలివిజన్‌లో కేవలం సంచలన ప్రకటనలు చేసేటపుడు మాత్రమే కనిపించే స్టార్ ప్రజెంటర్ రి చున్-హీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘ఉ.కొరియా సంపూర్ణ అణ్వాయుధ శక్తిసామర్థ్య దేశంగా అతవరించినట్టు అధ్యక్షుడు కిమ్ సగర్వంగా ప్రకటించాడు. రాకెట్ శక్తిని మరింత పెంపొందించుకునే క్రమంలో బుధవారం పరీక్షించిన హ్వాసోంగ్-15 ఖండాంతర బాలిస్టిక్ కిపణి వెలకట్టలేని విజయాన్ని నమోదు చేసింది. డిపిఆర్‌కె ఘనతను చాటడానికి ఇదొక చారిత్రక మైలురాయి’ అంటూ ఉ.కొరియాకు బదులు అధికారిక సంక్షిప్త నామాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఉద్వేగంగా ప్రకటించింది. ఇంతకుముందు జరిపిన పరీక్షలకు బుధవారం నాటి క్షిపణి పరీక్ష పూర్తి భిన్నమంటూ అధికారిక మీడియా వెల్లడించడం గమనార్హం. ‘ఐసిబిఎం హ్వోసాంగ్ -15 ఖండాంతర క్షిపణి శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయలేం. అమెరికా ప్రధాన ప్రాంతాన్ని నిమిషాల్లో ధ్వంసం చేయగల అత్యంత శక్తివంతమైన అణ్వాయుధమిది’ అంటూ అధికారిక మీడియా ఏజెన్సీ కెసిఎన్‌ఏ ఓ కథనాన్ని ప్రచురించింది. క్షిపణి పరీక్ష జరిపిన ఫ్యాంగ్యాంగ్ వివరాల ప్రకారం హ్వోసాంగ్ -15 ఖండాంతర క్షిపణి 4,475 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, పరీక్ష జరిపిన ప్రాంతం నుంచి 950 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని పేర్కొంది. ఉ.కొరి యా బుధవారం పరీక్షించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి మహా శక్తివంతమైందని, అమెరికాలోని ఏ ప్రధాన నగరాన్నైనా నిమిషాల్లో ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగినదేనని పశ్చిమ పరిశీలకులు చెబుతున్నారు.

చిత్రం..అభివాదం చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్