అంతర్జాతీయం

ఆదుకుందాం.. సాయం చేయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, డిసెంబర్ 1: ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విలయాలు, ఘర్షణలు, కరువుకాటకాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోడానికి ఆర్థిక సహాయం చేయాలని ఐరాస తన సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలన్నీ మనవతాదృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ వ్యాప్తపంగా 136 మిలియన్ల మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారిన ఐరాస స్పష్టం చేసింది. ‘ వారందిని ఆదుకోవల్సిన బాధ్యత మనపై ఉంది. దీనికి ఐరాస నిధిని పెంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధిత జనం కళ్లన్నీ మనమీదే ఉన్నాయి’అని ఐరాస హ్యుమనిటేరియన్ చీఫ్ మార్క్ లౌకాక్ అన్నారు.కరవు, వరదలు, ప్రకృతి విలయం వంటి పరిస్థితులతో ప్రపంచంలో కోట్లాది మంది జీవనం అస్థవ్యస్థమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవల్సిన అవసరం ఉందని చెప్పారు.