అంతర్జాతీయం

చెప్పేదొకటి.. చేసేదొకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 3: ఉగ్రవాద నిరోధన విషయంలో పాకిస్తాన్ అందిస్తున్న సహాయ సహకారాలు ఎంతమాత్రం సంతృప్తికరంగా లేవని అమెరికా ఆరోపించింది. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లను అదుపు చేయడంలో పాక్ ప్రభుత్వం ఎలాంటి విజయమూ సాధించలేదని, ఈ రెండు ఉగ్రవాద సంస్థలూ పాక్ గడ్డపై తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాయని సీనియర్ వైట్‌హౌస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడం ఉగ్రవాద నిరోధనలో పాకిస్తాన్ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా తెలిపారు.