అంతర్జాతీయం

పాక్ ఎన్నికల్లో సరుూద్ పోటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, డిసెంబర్ 3: తొమ్మిదేళ్ల క్రితం భారత వాణిజ్య నగరం ముంబయిపై జరిగిన ఉగ్రదాడికి కుట్రదారుగా భావిస్తున్న హఫీజ్ సరుూద్ సారథ్యంలోని జమాత్ ఉద్ దవా పార్టీ వచ్చే ఏడాది జరగనున్న పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఇందుకు సంబంధించిన రాజకీయ సంకేతాలను హఫీజ్ సరుూద్ అందించారు. అయితే మిల్లీ ముస్లింలీగ్ పేరుతోనే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని, దీన్నో రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ ముందు నమోదు చేసుకుంటామని సరుూద్ వెల్లడించారు. 2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడికి సారథ్యం వహించిన లష్కరే తోయిబా కీలక సంస్థగా భావిస్తున్న జమాత్ ఉద్ దవాపై నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ సరుూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా, ఐక్యరాజ్య సమితి ప్రకటించాయి. ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన సరుూద్ 2018 సంవత్సరాన్ని కాశ్మీరీలకే అంకితం చేస్తున్నామని ప్రకటించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కాశ్మీరీల పోరాటానికి మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాశ్మీర్‌పై నోరెత్తకుండా భారత్ తమపై ఒత్తిడి తెస్తోందని పేర్కొన్న ఆయన పరోక్ష దౌత్యం వల్లే కాశ్మీర్ లక్ష్యానికి విఘాతం కలుగుతుందని పాకిస్తాన్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తమను పాకిస్తాన్‌లో, హురియత్ నేతలను భారత్‌లో నిర్బంధించడం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందన్నారు. కాశ్మీరీల లక్ష్యాన్ని దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని గృహ నిర్బంధం నుంచి తాను విడుదల కావడం భారత్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందని సరుూద్ పేర్కొన్నారు. కాశ్మీరీలపై దాడులను ఆపనంతవరకు తమ పోరాటం ఆగే ప్రసక్తి లేదని, మరింతగా దీన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.