అంతర్జాతీయం

చబహార్ రేవు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహరాన్, డిసెంబర్ 3: భారత్-ఇరాన్ దేశాలు సంయుక్తంగా నిర్మించిన అతిపెద్ద చబహార్ రేవు తొలిదశను ఇరాన్ ప్రధాని హుస్సేన్ రౌహానీ ఆదివారం ప్రారంభించారు. దీనివల్ల అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు పాకిస్తాన్‌తో నిమిత్తం లేకుండా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమం అవుతుంది. అఫ్గానిస్తాన్, ఇరాన్‌లకు తమ భూభా గం మీదుగా భారత్ వస్తువుల ఎగుమతిని పాక్ అనుమతించకపోవడంతో ఈ రేవు నిర్మాణానికి సంబంధించి ఇరాన్-్భరత్‌ల మధ్య ఒప్పం దం కుదిరింది. దీని తొలిదశ ప్రారంభమైన నేపథ్యంలో ఇది పూర్తి 2018 చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని భారత్ ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్‌లో గ్వాదర్ రేవు నిర్మాణంలో చైనా పూర్తి స్థాయిలో సహకరిస్తున్న నేపథ్యంలో చబహార్ రేవు నిర్మాణానికి భారత్-ఇరాన్ దేశాలు శ్రీకారం చుట్టాయి. దీని నిర్మాణంలో భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది.