అంతర్జాతీయం

పెనుమంటల్లో పశ్చిమాసియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమాసియాలో మళ్లీ పెనుమంటలు చెలరేగుతున్నాయి. తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ రాజధానిగా జరూసలెంను గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై ముస్లిం ప్రపంచం భగ్గుమంటోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గాజా ప్రాంతంలో నినాదాలు చెలరేగాయి. ఈ రెండు దేశాల జెండాలను తగులబెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ ట్రంప్ నిర్ణయాన్ని తూర్పారబట్టాయి. పశ్చిమాసియా ఇక అగ్ని గుండమేనని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ నిప్పులు చెరిగితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అమెరికా అధినేతపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటు పాలస్తీనా, అటు ఇజ్రాయెల్ దేశాలు జరూసలెం తమదేనంటూ వాదించిన నేపథ్యంలో ఎవరిపక్షం వహించకుండా దశాబ్దాల పాటు అమెరికా వౌనం వహించింది. ట్రంప్ తాజాగా తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో సద్దుమణిగిందనుకున్న సమస్య మళ్లీ కార్చిచ్చులా మారే అవకాశం కనిపిస్తోంది.