అంతర్జాతీయం

ఎన్‌ఎస్‌జీపై ఒకటే మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, డిసెంబర్ 7: భారత్‌కు అణు సరఫరా గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం కల్పించే విషయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా తన వైఖరిని సమర్థించుకుంది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వకూడదని మొదటినుంచీ చైనా వాదిస్తోంది. ‘ఎన్‌ఎస్‌జీలోకి కొత్తగా ప్రవేశం కల్పించకూడదన్న మా విధానంలో ఎలాంటి మార్పూలేదు’ అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గేంగ్ షుంగ్ స్పష్టం చేశారు. భారత్‌కు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కల్పించే విషయంలో చైనాతో మాట్లాడతామని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గీ రెబ్కొవ్ చేసిన ప్రకటనపై చైనా తీవ్రంగానే స్పందించింది. సెర్గీ బుధవారం ఢిల్లీలో ఈ ప్రకటన చేశారు. ‘ఎన్‌ఎస్‌జీలో నియమావళికే మేం ప్రాధ్యాతనను ఇస్తాం. పారదర్శకత, జవాబుదారీతనం, ఏకాభిప్రాయం ద్వారానే కొత్త దేశాలకు సభ్యత్వం కల్పించాలన్నది మా అభిమతం. దీనికి విరుద్ధంగా జరిగే ఏ చర్యనూ చైనా సమర్థించదు’ అని షుంగ్ స్పష్టం చేశారు.