అంతర్జాతీయం

నేడు భద్రతామండలి అత్యవసర భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, డిసెంబర్ 7: జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద ప్రకటన నేపథ్యంలో తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి అత్యవసర సమావేశం శుక్రవారం జరగబోతోంది. జెరూసలెంలో అమెరికా రాయబార కార్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతామండలిలోని 15 మంది సభ్యుల్లో కనీసం ఎనిమిది మంది అత్యవసర సమావేశం జరపాలని నిర్ణయించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్‌తోపాటు శాశ్వత సభ్యత్వం లేని బొలీవియా, ఈజిప్ట్, ఇటలీ, సెనెగల్, స్వీడన్ తదితర దేశాలు కోరాయి. సమావేశంలో ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో భద్రతా మండలిని ఉద్దేశించి మాట్లాడతారు.
కాగా, అంటోనియో ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రత్యక్ష చర్చల ద్వారా జెరూసలెం వివాదంపై నిర్ణయం తీసుకోవాలని, రెండు దేశాలకూ చర్చలే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ చేసే వాదనలతో పాటు భద్రతామండలి, ఐరాస జనరల్ అసెంబ్లీ గతంలో చేసిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.