అంతర్జాతీయం

పత్రికలపైనే మోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 8: అరచేతికి ఆరోవేలుగా స్మార్ట్ఫోన్ స్థిరపడటమే కాదు, ప్రపంచ దర్శినిగానూ అది సేవలందిస్తోంది. దీంతో జనమంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తున్నారంటూ రోజుకో తరహా కథనం వెలుగుచూస్తూనే ఉంది. అయితే, వార్తల వ్యవహారానికి వస్తే అధికశాతం ఇంకా ప్రింట్ మీడియాపట్లే ఆసక్తి చూపుతున్నారంటూ అధ్యయనాలు తేటతెల్లం చేస్తుండటం గమనార్హం. సాంకేతిక విప్లవంతో అంతర్జాలం పూర్తిగా అందుబాటులోకి వచ్చేయడంతో, చదువరుల సంఖ్య తగ్గి పత్రికల సర్క్యులేషన్లు పడిపోతున్నాయన్న వాదన ఒకవైపు ఉంది. అయితే, అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అత్యంత సులువుగా వాడుకుంటున్న యవతే ప్రింట్ మీడియా పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు అధ్యయనాలు తేటతెల్లం చేయడం గమనార్హం. వార్తలు, కథనాలను ఆన్‌లైన్‌లో చూడ్డానికి ఎంత సమయం వెచ్చిస్తున్నారో అంతకు రెట్టింపు సమయాన్ని న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు చూడ్డానికీ వెచ్చిస్తున్నట్టు ఇటీవల యూకేలో సాగిన సుదీర్ఘ అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. యూకేలో ప్రాధాన్యత కలిగిన ఎనిమిది జాతీయ పత్రికల నుంచి 2016 సంవత్సరానికి సేకరించిన సమాచారం ఆధారంగా సాగిన అధ్యయనంలో, 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులు పత్రికలు చదవడానికే ఇష్టపడుతున్నట్టు తేలింది.
సర్వేలో పాల్గొన్న యువకులు ఏడాదికాలంలో వెబ్‌పోర్టల్స్, యాప్స్‌లోని ఆన్‌లైన్ ఎడిషన్స్ చదవడానికి 11.9 బిలియన్ నిమిషాలు వెచ్చిస్తే, ప్రింట్ మీడియా ఎడిషన్స్ చదవడానికి 21.7 బిలియన్ నిమిషాల సమయం వెచ్చించారని లండన్ యూనివర్శిటీ జర్నలిజం విభాగం జరిపిన అధ్యయన సారాంశం స్పష్టం చేస్తోంది. వార్తలు, కథనాల సంగ్రహణకు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారా, ప్రింట్ మీడియా పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారా? అన్న కోణంలో జరిపిన సర్వే ఆసక్తికరమైన సారాంశానే్న అందించింది. యువతరం ముఖ్యంగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులు, పత్రికలకు అలవాటుపడిన వాళ్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశే్లషిస్తే.. ఆన్‌లైన్ కంటే ప్రింట్ మీడియాకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్టు తేలింది అని సర్వేకు నాయకత్వం వహించిన లండన్ యూనివర్శిటీ సిటీ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ నీల్ తుర్మన్ వెల్లడించారు. అధ్యయన సారాంశంలో పేర్కొన్న దాని ప్రకారం వార్తా కథనాల కోసం వారంలో 23 నిమిషాలకుపైగా ప్రింట్‌మీడియాపై వెచ్చిస్తుంటే, ఆన్‌లైన్‌పై ఆధారపడిన వాళ్లు సరాసరిన 43 సెకండ్లు తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారని తేల్చారు. అలాగే, ఆన్‌లైన్ కంటే వార్తా పత్రికలు, మ్యాగజైనే్ల యువతరంలో ఎక్కువ ఆసక్తి, ఏకాగ్రతను చూరగొంటున్నాయని తేల్చారు.
నిజానికి ప్రింట్ మీడియా కంటే డిజిటల్ యాక్సెస్ (వెబ్‌సైట్లు, న్యూస్ యాప్స్, ఆన్‌లైన్ చానెల్స్ తదితరాలు) తక్కువ ఖర్చే అవుతున్నప్పటికీ, ప్రింట్ మీడియా పట్ల బ్రిటన్ యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం ప్రత్యేకమైన విషయమేనని అధ్యయనవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.