అంతర్జాతీయం

అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, డిసెంబర్ 8: పాకిస్తాన్‌లో ఉంటున్న తమ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని తాలిబన్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ చైనా హెచ్చరికలు జారీచేసింది. చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు అందినట్లుగా స్పష్టం చేసింది. ఇస్లామాబాద్‌లోని చైనా ఎంబసీ తమ వెబ్‌సైట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘చైనా సంస్థలపైనా, వ్యక్తులపైనా వరుసగా తాలిబన్ ఉగ్ర దాడులు జరిగే ప్రమాదం ఉంది’ అని స్పష్టం చేసింది. దీని దృష్ట్యా చైనా పౌరులెవరూ బయటికి రావొద్దని రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని తెలిపింది. అంతర్జాతీయంగా చైనా ఆర్థికంగానూ, రాజకీయంగానూ విస్తరించడంతో ఆ దేశానికి చెందిన పౌరులపై దాడులు జరిగే ప్రమాదమూ పెరిగింది. క్వెట్టాలో ఇద్దరు చైనా టీచర్లను కిడ్నాప్ చేసి హతమార్చామని ఇటీవల ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం గమనార్హం. పాకిస్తాన్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. వేలాదిమంది చైనా కార్మికులు అనేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు.