అంతర్జాతీయం

ఆ నిర్ణయం సమంజసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 8: ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వైట్ హౌస్ గట్టిగా సమర్ధించింది. ట్రంప్ నిర్ణయం వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందని, మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియకు తాము త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. జెరూసలెం వ్యవహారంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై మిత్రదేశాలతో సహా అనేక దేశాలు అమెరిగాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వైట్ హౌస్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసిన చందంగా మారాయి. ఇప్పటికే మధ్య ప్రాచ్యలో తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మిత్ర దేశాలకు కూడా ఈ విషయంలో అమెరికాను తీవ్ర స్థాయిలోనే తప్పుపట్టాయి. మధ్యప్రాచ్య శాంతికి సంబంధించిన చర్చలను తాము కొనసాగిస్తామని వైట్‌హౌస్ అధికారి శారాసాండర్స్ మీడియాకు తెలిపారు. జెరూసలెం వ్యవహారంలో అమెరికాను ఒక్క ఇజ్రాయెల్ మాత్రమే సమర్ధించింది తప్ప మిగతా దేశాలు మద్దతు ఇచ్చాయా అన్న ప్రశ్నకు‘ఏ దేశం ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు’అని ఆమె బదులిచ్చారు. ఇలా ఉండగా జెరూసలెం విషయంలో ఓ పక్క ప్రపంచ దేశాలు మండిపడుతున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో యూదు ఉత్సవం అయిన హనుక్కాను అత్యంత ప్రత్యేకమైన రీతిలో జరుపుకొన్నారు. ఈ సమావేశంలో ట్రంప్‌తోపాటు ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా పాల్గొన్నారు. జారెద్ కుష్నర్‌ను పెళ్లి చేసుకున్న తరువాత ఇవాంక యూదు మతాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించడం ద్వారా దశాబ్దాలుగా సాగిన అమెరికా తటస్థవైఖరికి ట్రంప్ చరమగీతం పాడారు. దీంతో జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు అనేక దేశాలు అమెరికాకు వ్యతిరేకమయ్యాయి. క్రైస్తవమత గురువుపోప్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.