అంతర్జాతీయం

వ్యూహాత్మక భాగస్వామిగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 12: రక్షణ, భద్రతల విషయంలో భారత్, అమెరికాలు ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్‌ను అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక రక్షణ భాగస్వామి హోదాను ఇవ్వాలని రిపబ్లికన్ సెనెటర్ జాన్ మెకైన్ ఆదివారం ప్రతిపాదించారు. దీనికి సంబంధించి జాతీయ భద్రత ధ్రువీకరణ చట్టం (ఎన్‌డిఏఏ) 2017 చట్టానికి అవసరమైన సవరణలు చేయాలని అధ్యక్షుడు బరాక్ ఒబామాను జాన్ కోరారు. రక్షణ ఎగుమతుల నియంత్రణ నిబంధనలలో అవసరమైన మార్పులను చేయాలన్నారు. రెండు దేశాల మధ్య ద్రుఢమైన రక్షణ సహకారం ఉండాలని అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రక్షణ భాగస్వామ్యం ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు.
‘్భరత్‌తో రక్షణ సహకారంపై అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన హామీ ప్రాధాన్యపరంగా ముందుకు సాగాలి. దక్షిణాసియా, భారత పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా ముఖ్యం’ అని జాన్ అన్నారు. ఈ ప్రతిపాదన వచ్చేవారం ఓటింగ్‌కు రానుంది. సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది. రక్షణ సాంకేతికతను బదిలీ, వ్యాపారం వంటి అంశాలలో భారత్‌కు సహకారాన్ని విస్తరించాలని ఈ ప్రతిపాదనలో కోరారు.