అంతర్జాతీయం

ఏకాకి అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 9: జెరూసలెం వ్యవహారంలో అమెరికా ఏకాకిగా మారింది. ఈ వివాదాస్పద నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలు శనివారం నిలదీశాయి. అమెరికాకు చాలా సన్నిహితంగావుండే బ్రిటన్, ఫ్రాన్స్‌వంటి దేశాలు సైతం ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రస్వరంతో వ్యతిరేకించాయి. దాదాపుగా భద్రతా మండలి సభ్య దేశాలన్నీ ట్రంప్ నిర్ణయంపట్ల ఆందోళన వ్యక్తం చేస్తే, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాత్రం తమ ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ఈ విషయంలో ఏ దేశం మద్దతు లేకపోయినా తమ వాదన పట్ల ఆమె నిలబడ్డారు. జెరుసలెం వ్యవహారంపై సర్వత్రా తీవ్రస్థాయిలో ఆందోళనలు, హాహాకారాలు చెలరేగుతున్న నేపథ్యంలో 15మంది సభ్యుల భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ‘అమెరికా నిర్ణయంతో మేమెంత మాత్రం ఏకీభవించటం లేదు. అలాగే, టెల్ అవీవ్ నుంచి జెరుసలెంకు అమెరికా తన రాయబారి కేంద్రాన్ని మార్చడాన్నీ మేం ఒప్పుకోవడం లేదు. అమెరికా నిర్ణయం మండలి తీర్మానాలకు పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా పశ్చిమాసియాలో శాంతి స్థాపన అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని శాశ్వత సభ్యదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇటీలీ, జర్మనీ, స్వీడన్‌లు ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి. జెరుసలెం హోదా ఏమిటన్నది నిర్ణయించుకోవాల్సింది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలేనని స్పష్టం చేశాయి. చర్చల ద్వారా ఈ దేశాలు తీసుకునే నిర్ణయం ఆధారంగానే జెరుసలెం ఎవరికి చెందుతుందన్న దానిపై తుది అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జెరుసలెంను ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా ఉమ్మడి రాజధానిగా కొనసాగించడమే ఉత్తమమని మొదటి నుంచీ ఐరోపా యూనియన్ సభ్య దేశాలు చెబుతూనే వస్తున్నాయి. ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చే వరకూ యథాతథ రీతిలోనే జెరుసలెం హోదాను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా, ట్రంప్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన నిక్కీ హేలీ ‘అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన ప్రక్రియను బలోపేతం చేయాలన్నదే మా ఉద్దేశం. అయితే, అన్ని దేశాలూ ఇందుకు సహకరిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం’ అని స్పష్టం చేశారు. అయితే, సరిహద్దులు, సార్వభౌమత్వం వంటి అంశాలపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వీటిని చర్చలద్వారా నిర్థారించుకోవాల్సిన బాధ్యత ఇజ్రాయెల్, పాలస్తీనాలదేనని అన్నారు.