అంతర్జాతీయం

అట్టుడికిన పాలస్తీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజా సిటీ, డిసెంబర్ 9: ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలెంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వరుసగా మూడోరోజూ పాలస్తీనాలో తీవ్రస్థాయిలో ఆందోళనలు, ఘర్షణలు జరిగాయి. పాలస్తీనా ప్రాంతాలన్నీ అశాంతితో అట్టుడికిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా దళాలను మోహరించి ఇజ్రాయెల్ పరిస్థితిని అదుపు చేసేందుకు గాజాలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకూ ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలకు, పాలస్తీనా నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. శనివారం ఈ ప్రాంతాలన్నీ అల్లర్లతో అట్టుడికాయి. ఇజ్రాయెల్ దళాలపై పాలస్తీనా నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి బాష్పవాయి గోళాలు, రబ్బర్ బుల్లెట్లు, కొన్నిచోట్ల నిజమైన బుల్లెట్లను పేల్చారు. ఆందోళనకారుల్లో ఒకరి అంత్యక్రియల సందర్భంగా శనివారం పాలస్తీనీయులు మరింతగా పేట్రేగిపోయారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి మళ్లీ పాలస్తీనా తిరుగుబాటు చేయాలంటూ హమన్ నాయకుడు ఇస్మాయిల్ హనియా పిలుపునివ్వడంతో, సమీప భవిష్యత్‌లోనే ఈ ప్రాంతం అంతా హింసాకాండతో అట్టుడికే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే జోర్డాన్, టర్కీ, పాకిస్తాన్, మలేసియా సహా అనేక ముస్లిం, అరబ్ దేశాల్లో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే.