అంతర్జాతీయం

నేపాల్ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, డిసెంబర్ 11: నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోంది. సోమవారం సాయంత్రానికి 106 స్థానాలను కైవసం చేసుకున్న వామపక్ష కూటమి అధికార నేపాలీ కాంగ్రెస్‌ను వెనక్కినెట్టేసింది. పార్లమెంటులో మొత్తం 275 స్థానాలుండగా, వీటిలో 165 స్థానాలకు సాధారణ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. మిగతా స్థానాలను దామాషా పద్ధతిలో నిర్ణయిస్తారు. నేపాల్‌లో జరుగుతున్న ఈ చారిత్రక పార్లమెంటు ఎన్నికల అనంతరం రాజకీయ స్థిరత్వం ఏర్పడుతుందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.