అంతర్జాతీయం

ఇరాన్‌లో భూకంపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, డిసెంబర్ 12: ఇరాన్‌లోని కెర్మాన్ రాష్ట్రంలో మంగళవారం భూకం పం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. దీనివల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదని మీడి యా కథనాల ద్వారా వెల్లడైంది. రావర్ పట్టణంలో గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆరు గ్రామాల్లో పాత ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12:13 గంటల ప్రాంతంలో హెజ్‌డాక్ పట్టణానికి 50 కిలోమీటర్లలో కేంద్రీకృతమైందని వారన్నారు. దేశ రాజధాని టెహ్రాన్‌కు కెర్మాన్ 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంప వల్ల కొన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్టు ఐఎస్‌ఎన్‌ఏ వార్తా సంస్థ ప్రకటించింది.