అంతర్జాతీయం

సరబ్‌జీత్ హత్య కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, డిసెంబర్ 12: భారత్‌కు చెందిన సరబ్‌జీత్ హత్య కేసులో కోఠ్ లఖ్పత్ జైలు సూపరింటెండెంట్ లాహోర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో మంగళవారం వాంగ్మూలం ఇచ్చారు. 2013 మేలో పాక్ జైలులో అమీర్ సర్ఫ్జ్ అలియాస్ తాంబా, ముదస్సర్ అనే ఖైదీలు దాడి చేసి భారతీయుడైన సరబ్‌జీత్ (49)ను హతమార్చిన సంగతి తెలిసిందే. అదనపు జిల్లా జడ్జి అమీన్ హైదర్ జైలు సూపరింటెండెంట్ నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చే వారం హాజరు కావాలంటూ మరో ఇద్దరు సాక్షులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసుపై లాహోర్ హైకోర్టుకు చెందిన జస్టిస్ మఝార్ అలీ అక్బర్ నఖ్వీ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయవిచారణ సంఘం తొలుత 40 మంది సాక్షులను విచారించింది. సరబ్‌జీత్ కుటుంబ సభ్యులను విచారించేందుకు పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ద్వారా న్యాయవిచారణ సంఘం నోటీసులు జారీ చేసింది. లాహోర్, ఫైసలాబాద్‌లో పేలుళ్లకు పాల్పడి ఎంతోమంది అమాయకులను బలిగొన్నందుకే సరబ్‌జీత్‌ను తాము హత్య చేశామని నిందితులు టాంబా, మదస్సర్ న్యాయ విచారణ సంఘానికి గతంలో తెలిపారు. 1990లో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో బాంబుదాడులకు పాల్పడి 14మంది పౌరుల మరణానికి కారకుడని ఆరోపిస్తూ సరబ్‌జీత్‌కు మరణశిక్షను విధిస్తూ అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. కాగా, సరిహద్దులో ఉండగా పాక్ సైనికులు సరబ్‌జీత్‌ను అనుమానించి పట్టుకెళ్లాయని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైలులో ఖైదీగా ఉన్న సరబ్‌జీత్‌పై మిగతా ఖైదీలు దాడి చేసి హత్యచేశారు.