అంతర్జాతీయం

శాంతి ప్రక్రియలో అమెరికా జోక్యం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, డిసెంబర్ 13: మధ్య ప్రాచ్యంలో శాంతి ప్రక్రియ పేరిట అమెరికా ప్రమేయాన్ని ఇకపై తమ ప్రజలు ఆమోదించే ప్రసక్తే లేదని పాలస్తీనా అధ్యక్షుడు మహముద్ అబ్బాస్ తేల్చి చెప్పారు. పవిత్ర నగరమైన జెరూసలెంను ఇజ్రాయల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో టర్కీలో బుధవారం జరిగిన ఇస్లాం దేశాల అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. ట్రంప్ నిర్ణయాన్ని ముస్లిం ప్రపంచమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని అబ్బాస్ పిలుపునిచ్చారు. శాంతి ప్రక్రియలకు సంబంధించి ఇకముందు అమెరికా పాత్ర ఉండదన్నారు. జెరుసలెంపై ట్రంప్ నిర్ణయం అనంతరం ఇజ్రాయల్- పాలస్తీనా సంఘర్షణపై శాంతియుతంగా వ్యవహరించాలని తమ దేశ ప్రజలు భావిస్తున్నారని ఆయన వివరించారు. అయితే, శాంతి ప్రక్రియలో అమెరికాను ‘మచ్చలేని మధ్యవర్తి’గా తాము ఆమోదించలేమన్నారు. ‘ఇస్లామిక్ సహకార సంస్థ’ (ఓఐసి) లోని 57 సభ్య దేశాల అధిపతులు, ఉన్నతాధికారులు ఇస్తాంబుల్ సదస్సులో పాల్గొంటున్నారు. అమెరికా నిర్ణయాలను తూర్పారపడుతూ, ఇస్లాం దేశాల ఐక్యతను చాటిచెప్పేందుకు ఓఐసి అధినేత, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ నేతృత్వంలో ఈ సదస్సు జరుగుతోంది.
జెరూసలెంపై ట్రంప్ నిర్ణయాన్ని ఎర్డొగాన్ గట్టిగా వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇజ్రాయల్ ఒక ‘ఆక్రమిత దేశమ’ని, ‘ఉగ్రవాద రాజ్యమ’ని ఆయన ఆరోపించారు. సదస్సుకు ముందు జరిగిన సన్నాహక సమావేశంలో టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కవుసొగ్గు ‘ఓఐసి’ సభ్య దేశాల విదేశాంగ మంత్రులనుద్దేశించి మాట్లాడుతూ, జెరూసలెంను పాలస్తీనా ఆక్రమించేలా అమెరికా వ్యవహరిస్తోందన్నారు. అమెరికా అత్యుత్సాహంపై ఇజ్రాయల్ వౌనంగా ఉన్నా, తాము మాత్రం ప్రేక్షకపాత్ర వహించబోమని, అగ్రరాజ్యం నిర్ణయాలను ‘శూన్యం’గా తాము భావిస్తామని ఆయన అన్నారు.