అంతర్జాతీయం

ఆస్కార్ రేసులో చోటుదక్కని న్యూటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిల్స్, డిసెంబర్ 15: బాలీవుడ్ నటులు రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘న్యూటన్’ చిత్రం ఆస్కార్ రేసులో నిలబడలేకపోయింది. 90వ అకాడెమీ అవార్డు ఉత్తమ విదేశీ భాషా చిత్రాల జాబితాలో తొలుత అర్హత సంపాదించుకున్న ‘న్యూటన్’, తదుపరి వడపోత జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. తదుపరి జాబితాలో న్యూటన్‌కు స్థానం దక్కలేదని మోషన్ పిక్చర్స్ అండ్ సైనె్సస్ అకాడమీ ప్రకటించింది. వడపోత అనంతరం తదుపరి వోటింగ్‌కు 9 చిత్రాలు మాత్రమే రేసులో ఉన్నాయి. అవి ఫెంటాస్టిక్ వుమన్ (చిలీ), ఇన్ ది ఫేడ్ (జర్మనీ), ఆన్ బాడీ అండ్ సోల్ (హంగేరీ), ఫాక్స్‌ట్రాట్ (ఇజ్రాయిల్), ది ఇన్సల్ట్ (లెబనాన్), లవ్‌లెస్ (రష్యా), ఫెలిసైట్ (సెనెగల్), ది వూండ్ (సౌత్ ఆఫ్రికా), ది స్క్వేర్ (స్వీడన్). ఇంతవరకూ ఏ ఒక్క భారతీయ చిత్రానికి ఆస్కార్ దక్కకపోవడం గమనార్హం. ఇంతవరకూ విదేశీ భాషా చిత్రాల క్యాటగిరీలో టాప్ ఫైవ్‌లో స్థానం సంపాదించుకున్న చిత్రాలు లగాన్ (2001), మదర్ ఇండియా (1958), సలామ్ బాంబే (1989) మాత్రమే. ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 4న లాస్‌ఏంజిల్స్‌లో నిర్వహించనున్నారు.