అంతర్జాతీయం

హెచ్-1బీ జీవిత భాగస్వాములకు ఇక్కట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 16: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఇకపై అమెరికాలో ఉద్యోగాలు చేయరాదంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ఈ విషయాన్ని 3అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ2 (డిహెచ్‌ఎస్) అధికారికంగా ప్రకటించింది. హెచ్-1బీ వీసాల జారీని మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇటీవల అమెరికా చట్టసభ 3కాంగ్రెస్‌లో బిల్లు ప్రతిపాదించగా, దానికి ఆమోదముద్ర కూడా లభించింది. దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న 3బై అమెరికన్, హైర్ అమెరికన్2 విధాన నిర్ణయంలో భాగంగానే హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న జీవిత భాగస్వాములు (్భర్య లేదా భర్త) అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు వెసులబాటు కల్పించారు. ఈ విధానాన్ని ఎత్తివేయాలని ట్రంప్ ప్రభుత్వం సంకల్పించింది. ట్రంప్ నిర్ణయం అమలులోకి వస్తే హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో ఉద్యోగాలు లభించడం కష్టతరమవుతుంది. 3హెచ్-4 డిపెండెండ్ వీసా2 కింద వలసదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఒబామా కల్పించిన వెసలుబాటు ఇక లభించదు. ఒబామా తీసుకున్న నిర్ణయాలతో తమ ఉద్యోగాలకు గండిపడుతుందని గతంలో అమెరికాలో పలు సంస్థలు ఆందోళనలు చేశాయి. ఒబామా నిర్ణయంతో సొంత గడ్డపై అమెరికన్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని ప్రచారం చేసి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ యువతను ఆకట్టుకున్నారు.