అంతర్జాతీయం

అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలాలాబాద్, డిసెంబర్ 31: తూర్పు అఫ్గానిస్తాన్‌లో ఓ శవదహన సంస్కారం జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించనప్పటికీ ఇటీవలి కాలంలో ఈ తరహా దాడులకు ఒడిగడుతున్న తాలిబన్, ఐసిస్ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ జిల్లా గవర్నర్ దహన సంస్కారం జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

చిత్రం..ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది