అంతర్జాతీయం

మోసం.. దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 1: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌కు ఎలాంటి ఆర్థిక సహాయం అందజేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ‘పాకిస్తాన్ పచ్చి అబద్ధాల కోరు. మోసానికి పాల్పడి ఇన్నాళ్లూ అమెరికా ఆర్థిక సాయం పొందింది’అంటూ ట్రంప్ నిప్పులు చెరిగారు. గత పదిహేనేళ్లలో అమెరికా 33 బిలియన్ డాలర్ల సాయం అందించిందని ట్రంప్ తన ట్విట్టర్‌లో తెలిపారు. ఇక ముందు పాకిస్తాన్‌కు ఎలాంటి ఆర్థిక సహాయం అందచేయబోమని ట్రంప్ వెల్లడించారు.‘మాయ మాటలు చెబుతూ అమెరికాను, మా నాయకులను పాకిస్తాన్ వెర్రివాళ్లను చేసింది‘అంటూ అధ్యక్షుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అమెరికా సాయం పొందుతూ ఉగ్రవాదులలు వంతపాడుతూ వస్తోందని ఆయన ఆరోపించారు. ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంతే పాకిస్తాన్ నుంచి ఎలాంటి సహకారం లేదని అమెరికా అధ్యక్షుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి పాక్‌కు ఒక్కపైసా సాయం అందించం, తక్షణం దీన్ని అమలు చేస్తామంటూ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. కాగా ట్రంప్ ట్వీట్‌పై పాకిస్తాన్ స్పందించింది. ‘ట్రంప్ ఆరోపణలకు వివరణ ఇస్తాం. వాస్తవాలేమిటో ప్రపంచానికి చెబుతాం’ అంటూ పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసీఫ్ స్పష్టం చేశారు. ఈమేరకు అసీఫ్ ట్వీట్ చేశారు. ఇలా ఉండగా ఆగస్టులో దక్షిణాసియా కొత్త విధాన ప్రకటన సందర్భంగా పాక్ తీరుపై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగానే మండిపడ్డారు. ఉగ్రవాద
అణచివేతకు వ్యతరేకంగా అమెరికా చేస్తున్న పోరుకు పాక్ నుంచి ఏమాత్రం సహకారం లేదని ట్రంప్ ధ్వజమెత్తారు. ఉగ్ర సంస్థలకు వత్తాసు పలుకుతున్న పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు గత వారం న్యూయార్ట్ టైమ్స్‌లో కథనం వెలువడింది. పాకిస్తాన్ వ్యవహారం ట్రంప్ నోటీసులో ఉందని గత వారం ఆఫ్గనిస్తాన్‌లో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన నేషనల్ సెక్యురిటీ స్ట్రాటజీ సమావేశంలో కూడా పాకిస్తాన్‌కు కల్పిస్తున్న ఆర్థిక సాయంపై ట్రంప్ ప్రస్తావించినట్టు తెలిసింది.
మోదీ దౌత్య ఫలితమే
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌పై వత్తిడి పెంచడానికి ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన దౌత్యమే కారణమని భారత ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు ఒక్కపైసా సాయం చేయబోమని ట్రంప్ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావుట్వీట్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గ్ధామంగా మారిందని, ఇదే విషయాన్ని మోదీ అనేక సార్లు అమెరికా దృష్టికి తెచ్చారని ఆయన అన్నారు. ప్రధాని దౌత్యఫలితంగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.
*
పాకిస్తానుకు ఇకపై
ముకుతాడును వేయనెంచి ముందస్తుగనే
షాకిస్తూ హెచ్చరికల
మేకును దిగగొట్టి ట్రంపు మేలనిపించెన్