అంతర్జాతీయం

తిక్కరేగితే స్విచ్ నొక్కేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జనవరి 1: కొత్త ఏడాది తొలి రోజున ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరింత రెచ్చిపోయారు. తమ జోలికొస్తే ఏం చేస్తానో తెలియదంటూ పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని హరిస్తే, ముప్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తనకు తిక్కరేగిందంటే నిరంతరం అందుబాటులో ఉండే అణు మీట నొక్కేస్తానంటూ బెంబేలెత్తించారు. అణ్వాయుధాల ప్రయోగాలు, క్షిపణుల పరీక్షలతో ప్రపంచ దేశాలను ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలను వణికిస్తున్న ఉత్తర కొరియా కొత్త ఏడాదిలోనే అదే దూకుడు ప్రదర్శిస్తామని ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది ప్యొంగాంగ్‌లో అణుప్రయోగం జరిపిన సంచలన సృష్టించిన కిమ్ 2018లోనే అనేక ప్రయోగాలు చేస్తామని హెచ్చరించారు. ‘నా డెస్క్‌పై నూక్లియర్ బటన్ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నొక్కుతా’ అని కిమ్ సంచలన ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో బహుళ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ‘నూక్లియర్ వార్‌హెడ్స్, క్షిపణుల ప్రయోగంలో అదే దూకుడు ప్రదర్శిస్తాం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని ఓ సందేశంలో స్పష్టం చేశారు. 2017 సెప్టెంబర్‌లో అత్యంత శక్తివంతమై హైడ్రోజన్ బాంబ్ ప్రయోగంతోపాటు, ఆరు క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియా జరిపింది. అమెరికాను లక్ష్యంగా చేసుకునే కిమ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఎన్ని వత్తిళ్లు వచ్చినా గత ఏడాది ఉత్తర కొరియా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కిమ్ చేసిన ప్రకటన మరిన్ని ఉద్రిక్తతలు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాను ఎదుర్కొనే సత్తా తమకు కుందని ఆయన చెప్పారు. తన ప్రకటనను ఆషామాషీగా తీసుకోవద్దని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.