అంతర్జాతీయం

సౌదీ అరేబియా చేరుకున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, ఏప్రిల్ 2: చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆ దేశానికి చేరుకున్నారు. భద్రత, ఉగ్రవాదంపై పోరాటం తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు పలు ఒప్పందాలను కుదుర్చుకుని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు నిశ్చయించుకోవడంతో మోదీ తొలిసారి సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి, సౌదీ అరేబియా నాయకత్వానికి మధ్య జరిగే చర్చల్లో ఉగ్రవాదంపై పోరాటం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. ఇస్లామ్ మతానికి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న సౌదీ అరేబియా ఉగ్రవాదంపై, ప్రత్యేకించి ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద గ్రూపుపై పోరాడేందుకు ఇటీవల 34 ఇస్లామిక్ దేశాలతో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యధికంగా చమురును ఉత్పత్తి దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాకు, భారత్‌కు మధ్య గత రెండు దశాబ్దాల నుంచి ఇంధన వ్యాపార రంగంలో సంబంధాలు పురోగమన దిశలో సాగుతున్నాయి. అయితే ద్వైపాక్షిక సంబంధాలను కేవలం ఈ రంగానికి మాత్రమే పరిమితం చేయకుండా మరిన్ని రంగాలకు విస్తరించడం, చమురు క్షేత్రాలు, చమురు శుద్ధి కర్మాగారాల్లో పెట్టుబడులు పెట్టి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడం తదితర అంశాలపై మోదీ పర్యటనలో ఇరు దేశాలు దృష్టి సారించవచ్చు.