అంతర్జాతీయం

హఫీజ్ సయాద్‌పై ఉక్కుపాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 1: ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సరుూద్ అణచివేతకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జమాత్ -ఉద్ -దవా చీఫ్ హఫీజ్ సరుూద్‌కు చెందిన చారిటీ సంస్థలు, ఆస్తులను సీజ్ చేయాలని యోచిస్తున్నట్టు ఓ మీడియా కథనం వెలువడింది. గడచిన ఏడాది డిసెంబర్ 19నే ప్రభుత్వంలోని కొన్ని కీలక విభాగాలతో సమాలోచనలు జరిపి ‘చర్యల ప్రణాళిక’ సిద్ధం చేసినట్టు ఉన్నతస్థాయి కమిటీలోని ముగ్గురు అధికారుల్లో ఒకరు వెల్లడించినట్టు ఆ వార్తా సంస్థ పేర్కొంది. పాక్‌లోని ఐదు ప్రాంతాల్లో విస్తరించిన సరుూద్ చారిటీ సంస్థలు, ఆస్తులను సీజ్ చేయడానికి సిద్ధమైన ‘రహస్య చర్యల ప్రణాళిక’ ఇప్పటికే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అందిందని అంటున్నారు. ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఎటిఫ్)’ పేరిట సిద్ధమైన ఆ రహస్య పత్రం సరుూద్ ఆస్తుల సీజ్‌కు సిద్ధమైన ‘చర్యల ప్రణాళికేక’నని ఆ కథనంలో పేర్కొనడం గమనార్హం. డిసెంబర్ 19న సిద్ధమైన పత్రంలో సరుూద్ చారిటీ సంస్థలు, వాటిని పెంచి పోషిస్తున్న తీరు, పెండింగ్ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు ఉన్నట్టు చెబుతున్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్, పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ వర్గాలు సంయుక్తంగా వీటి వివరాలు సేకరించి పొందుపర్చారని, సరుూద్‌కు సంబంధించి చారిటీ సంస్థలకు నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయన్న విషయాన్నీ పత్రంలో వివరణాత్మకంగా పొందుపర్చారని అంటున్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న సంస్థలు, మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్న వారి వ్యవహారాల నిగ్గుతేల్చేందుకు పనిచేస్తున్న అంతర్జాతీయ కార్యవర్గమే ఎఫ్‌ఏటిఎఫ్.
జెయుడి, ఎఫ్‌ఐఎఫ్ ఆస్తులను సీజ్ చేస్తున్నారా? అంటూ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి అహసన్ ఇక్బాల్‌ను ప్రశ్నించినపుడు ‘బయటినుంచి నిధులు సేకరిస్తూ పనిచేస్తున్న అన్ని చారిటీ సంస్థలనూ విచారించాలన్న ప్రభుత్వ ఆదేశాల్లో భాగమే ఇది’ అని మాత్రమే సమాధానమిచ్చారు. అయితే, ‘తామేమీ అమెరికా వత్తిడికి తలొగ్గి తీసుకుంటున్న చర్యలేమీ కావు’ అన్నారు. ‘మేం ఎవరి మెప్పుకోసమో పని చేయాల్సిన అవసరం లేదు. దేశ, ప్రపంచ ప్రజల సంక్షేమానికి బాధ్యతగా పని చేస్తున్న దేశం మాది’ అన్నారు. ఆస్తుల సీజ్‌కు సంబంధించి జెయుడి అధికార ప్రతినిధి సల్మాన్ షహీద్ సమాధానమిస్తూ ‘మాకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. చారిటీ సంస్థల పని, ఆస్తుల వివరాలను ఏ అధికారి ఇంతవరకూ ప్రశ్నించలేదు’ అని పేర్కొన్నారు.