అంతర్జాతీయం

భారత ఐటీకి ఎసరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 2: అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ ఆలోచన క్రమంగా అమల్లోకి వస్తోంది. తాజాగా హెచ్1బి వీసాలకు సంబంధించి నియమ నిబంధనల్లో చేస్తున్న మార్పుల వల్ల భారత ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఉద్యోగాలను పరిరక్షించడంతోపాటు వాటిని పెంపొందించుకోవాలన్న లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం హెచ్1బి వీసాలకు సంబంధించిన బిల్లును రూపొందించింది. ఇందులో భారత ఐటీ కంపెనీలపైన అలాగే హెచ్1బి వీసాలను ఉపయోగిస్తున్న వారిపైన అనూహ్యరీతిలో షరతులను విధించింది. ఇవి అమల్లోకి వస్తే ఐదు లక్షల నుంచి ఏడున్నర లక్షల మంది వరకూ భారత హెచ్1బి వీసా హోల్డర్లను వెనక్కి పంపేసే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వీసాలకు సంబంధించిన అనేక అంశాలను తాము అమెరికా సెనెటర్లు, కాంగ్రెస్ సభ్యులు, ట్రంప్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని నాస్కాం ప్రకటించింది. ఈ తాజా శాసనానికి సంబంధించి అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మార్పులపై అమెరికా అధికారులతో విస్తృతస్థాయి చర్చలు జరపుతామని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడి విధానాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ బిల్లు స్థానిక అమెరికా ఉద్యోగాలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు హెచ్1బి వీసాల దుర్వినియోగాన్ని, తప్పుడు మార్గంలో వాటి ద్వారా లబ్దిపొందడాన్ని అరికడుతుంది. అలాగే వీసా ఆధారిత కంపెనీలు అన్న నిర్వచనాన్ని ఈ బిల్లు ద్వారా ట్రంప్ ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. అలాగే, కనీస జీతం, నిపుణులైన ఉద్యోగుల బదిలీ వంటి అంశాలపైనా కఠినమైన ఆంక్షలనే విధిస్తోంది. యథాతథంగా దీన్ని అమల్లోకి తెచ్చినట్టయితే హెచ్1బి వీసాలు కలిగిన వారు భారీ సంఖ్యలోనే స్వదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా గ్రీన్‌కార్డు కోసం
ఎదురుచూస్తున్న అత్యంత సామర్థ్యం కలిగిన వారిపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే, హెచ్1బి వీసాలు కలిగివున్న వారిలో ఐదు నుంచి ఏడున్నర లక్షల వరకూ ఉద్యోగులు వెనక్కిరాక తప్పదు. తమంతట తాముగానే వేలాది మంది భారత ఐటీ ఉద్యోగులు స్వదేశాలకు వెళ్లిపోయే పరిస్థితిని ఈ బిల్లు ద్వారా ట్రంప్ ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ విధంగా వచ్చిన ఖాళీలను స్థానిక అమెరికన్లతో భర్తీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చట్టంలో పేర్కొన్నట్టుగా కనీసం వేతనాన్ని చెల్లిస్తున్నామని చెప్పడంతోపాటు, సదరు క్లైంట్లు ఓ నిబంధనను కూడా సంతృప్తిపర్చాల్సి ఉంటుంది. అంటే రానున్న ఐదారేళ్ల వరకూ తాజా వీసా హోల్డర్ ప్రస్తుతమున్న ఉద్యోగికి ఎలాంటి ఇబ్బందీ కలగదన్న హామీని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ బిల్లును జ్యుడీషియరీ కమిటీ ఆమోదించింది. త్వరలోనే దీన్ని సెనెట్ ఆమోదానికి పంపుతారు. కాగా, హెచ్1బి వీసాల నిబంధనల మార్పులపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రానప్పటికీ ఈ ప్రక్రియను మాత్రం లోతుగా గమనిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.