అంతర్జాతీయం

ఖలీదా జియాపై అరెస్టు వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జనవరి 2: మూడేళ్లనాటి కేసులో మాజీ ప్రధాని ఖలీదా జియాపై బంగ్లాదేశ్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా 2015లో ఖలీదా నాయకత్వంలోని పార్టీ ఓ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఓ బస్సుపై బాంబుదాడి జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. దీనిపై మాజీ ప్రధాని ఖలీదా జియాపై కేసు నమోదైంది. పేలుళ్ల ఘటనకు సంబంధించి జియాపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 72 ఏళ్ల ఖలీదా జియా అరెస్టుకు కొమిల్లా జిల్లా కోర్టు న్యాయమూర్తి జొయ్‌నాబ్ బేగం వారెంట్ జారీ చేశారు. ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) 2014 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించింది. అవామీలీగ్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా బీఎన్‌పీతోపాటు దాని మిత్రపక్షాలైన 20 పార్టీలు ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. జాతీయస్థాయిలో రహదారుల దిగ్బంధనం చేశాయి. సెంట్రల్ కొమిల్లా జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సుపై పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. దీనిపై పోలీసుల చార్జిషీట్ ఆధారంగా మాజీ ప్రధాని ఖలీదా జియాపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఖలీదాపై ఎన్నో కేసులున్నాయి. అవినీతి, అక్రమ కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. అలాగే 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధానికి సంబంధించి ఖలీదా జియా చేసిన అనుచిత వ్యాఖ్యలపైనా మాజీ ప్రధానిపై కేసు నమోదైంది. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్త ఆందోళన కార్యక్రమాల సందర్భంగా 125 మంది మృతి చెందారు. ఈ ఘటనలకు సంబంధించి అనేక కోర్టుల్లో ఖలీదాజియాపై కేసులు నడుస్తున్నాయి. కాగా హత్య, పేలుళ్లకు సంబంధించిన కేసుల్లో బీఎన్‌పీ నేత, జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ సహా 48 మందికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేసిన మర్నాడే మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్ జారీ కావడం గమనార్హం.