అంతర్జాతీయం

అరుణాచల్.. అదెక్కడ? ఉనికినే మేం గుర్తించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 3: భారత దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ఉనికిని తాము ఎన్నడూ గుర్తించలేదని చైనా బుధవారం స్పష్టం చేసింది. అలాగే అరుణాచల్‌లోకి తమ సైనిక దళాల చొరబాటుపైనా వౌనం వహించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలో దాదాపు 200 మీటర్లమేర తమ దళాలు చొరబడ్డాయన్న కథనాలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగానే స్పందించింది. అసలు అరుణాచల్ ప్రదేశ్ ఉందన్న విషయానే్న తాము ఎప్పుడూ గుర్తించలేదని దీర్ఘకాలంగా ఇదే వైఖరితో ఉన్నామని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జంగ్ షువాంగ్ స్పష్టం చేశారు. అసలు తమ దళాలు అరుణాచల్ భూ భాగంలోకి చొరబడ్డాయన్న విషయం తమకు తెలియదని అన్నారు. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌లో అంతర్భాగంగానే చైనా పరిగణిస్తోంది. దరిమిలా దాదాపు3,488 కిలోమీటర్లమేర వాస్తవాధీనరేఖ ప్రాంతంలో ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. గత నెలలో చైనా దళాలు అరుణాచల్‌లోకి ప్రవేశించడాన్ని భారత్ దళాలు నిరోధించాయని, దానితో తమ నిర్మాణ సామగ్రిని అక్కడే వదిలేసి చైనా సైన్యం వెళ్లిపోయినట్టుగా కథనాలు వచ్చాయి. సరిహద్దు సమస్య పరిష్కారంపై భారత్-చైనాలు పటుతరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరుదేశాలకు ఎంతో అవసరమన్నారు. డోక్లాం తరహాలో తలెత్తినట్టుగానే భారత్-చైనాల మధ్య మరో ప్రతిష్టంభనకు అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు‘ ఆ జఠిల సమస్యను గత ఏడాదే పరిష్కరించుకున్నాం’అని చైనా ప్రతినిధి బదులిచ్చారు.