అంతర్జాతీయం

నా దగ్గరా బటన్ ఉంది.. జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 3: అణ్వాయుధ హెచ్చరికలతో కుతకుత ఉడికిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే తీరులో తీవ్ర హెచ్చరిక చేశారు. కొత్త ఏడాది వేడుకల సందర్భంలో కిమ్ జోంగ్ మాట్లాడుతూ ‘నా టేబుల్‌మీదే న్యూక్లియర్ బటన్ ఉంటుంది. తిక్కరేగితే నొక్కేస్తా’నంటూ అమెరికాను తీవ్రంగా హెచ్చరించటం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తాజాగా అదే తీరులో ట్విట్టర్ వేదికగా తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘ఎవరైనా అతనికి చెప్పండి. నా టేబుల్ మీదా న్యూక్లియర్ బటనుంటుంది. అది ఉత్తర కొరియాకంటే పెద్దది, శక్తివంతమైనది కూడా. అది పనిచేస్తుంది’ అంటూ ట్రంప్ ఘాటు ట్వీట్ చేసినట్టు వైట్‌హౌస్ పేర్కొంది. అదేవిధంగా ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్ అణు కార్యక్రమాలను అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు కూడా వైట్‌హౌస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తమవద్దనున్న అణ్వాయుధాలు అమెరికాలోని ఏ ప్రాంతానికైనా చేరుకోగలవంటూ కిమ్ జోంగ్ పదేపదే హెచ్చరికలు చేస్తుండటం తెలిసిందే. ఏడాదికాలంగా రెండు దేశాల అధ్యక్షులు అణ్వాయుధ ప్రస్తావనలతో పరస్పరం మాటల దాడులు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధ గురిలోనే అమెరికా ప్రధాన ప్రాంతాలన్నీ ఉన్నాయని, తమ దేశం మరిన్ని శక్తివంతమైన అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులు తయారు చేయడమే కాదు, పరీక్షించడమూ మానదని పదే పదే ఉత్తర కొరియా ప్రకటిస్తుంటే, ‘ఉత్తర కొరియా అణ్వాయుధ అతి చర్యలన్నీ ప్రపంచ వినాశనానికి హేతువుగా కనిపిస్తున్నాయి. ఆ దేశం దూకుడుకు బ్రేకులు వేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి’ అని అమెరికా వాదిస్తోంది.
ఉత్తర కొరియా దూకుడుకు పగ్గాలు వేసేందుకు మావద్దనున్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ వ్యాఖ్యానించటం గమనార్హం.