అంతర్జాతీయం

హెచ్-1బీ వీసా పొడిగింపు ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 3: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ నినాదం ఫలితంగా హెచ్-1బీ వీసాలను నియంత్రించేందుకు రంగం సిద్ధమైంది. ట్రంప్ ప్రతిపాదించిన సవరణ బిల్లు ఆమోదం పొందితే దాదాపు 5 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగాలకు దూరమై, సొంత గడ్డకు పయనం కావల్సి ఉంటుందని ఓ అంచనా. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలని ఎదురుచూసే వారికి ఇకమీదట పొడిగింపు ఇవ్వరాదని ట్రంప్ యంత్రాంగం యోచిస్తోంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఆ దేశ ప్రజలకు ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు హెచ్-1బీ వీసాలకు పొడిగింపు ఇవ్వరాదని, అందుకు కొత్త నిబంధనలు తీసుకురావాలని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీస్’ పేర్కొంటోంది. అమెరికాలో ప్రస్తుత చట్టం ప్రకారం అక్కడ ఉద్యోగాలు చేసే విదేశీయులు హెచ్-1బీ వీసా పొందితే మొదట మూడేళ్ల కాలపరిమితితో పాటు మరో మూడేళ్లు పొడిగింపునకు అవకాశం ఉంది. మొత్తం ఈ ఆరేళ్ల కాలంలో వారి గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే, పరిశీలన పూర్తయ్యేవరకూ పొడిగింపు లభిస్తుంది. అయితే, ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణల పుణ్యమాని ఇక ఎలాంటి పొడిగింపులు ఉండవు. గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా వీసాను పునరుద్ధరించక పోవడమే ఈ సవరణ ముఖ్య ఉద్దేశం. సవరణ బిల్లు వల్ల అమెరికాకు ఉద్యోగాల రీత్యా వలస వచ్చిన వారికి ముఖ్యంగా భారతీయులకు ఇక గడ్డుకాలం తప్పదంటున్నారు. అమెరికాలోని ఐటీ సంస్థలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడి వేలాదిమంది భారతీయులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. దీంతో దాదాపు సగం మంది ఇంటిముఖం పట్టే అవకాశాలున్నాయని ఓ నివేదికలో పేర్కొన్నారు. దశాబ్దాకాలానికి పైగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారికి, అమెరికా పౌరసత్వం కలిగిన పిల్లలకు, అక్కడ ఇళ్లు కలిగినవారికి ఇబ్బందులు తప్పవని బారక్ ఒబామా హయాంలో న్యాయశాఖలో పనిచేసిన లియోన్ ఫ్రెస్కో అంటున్నారు.
హెచ్-1బీ వీసా కలిగిన సుమారు 1 మిలియన్ మంది ప్రస్తుతం గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. హెచ్-1బీ వీసాల వినియోగంలో, మంజూరులో భారీగా అవకతవకలు జరిగాయని ఎన్నికల సమయంలో ఆరోపించిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి వీసాల విషయమై సంస్కరణలు అమలు చేసేందుకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.