అంతర్జాతీయం

‘రాఫెల్’ రద్దుకు భారత్ నిర్ణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, జనవరి 3: 500 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే ‘రాఫెల్ యుద్ధ విమానాల’ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుందని ఇజ్రాయల్‌లోని ప్రఖ్యాత ఆయుధ తయారీ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన నేపథ్యంలో- ‘ఒప్పందం రద్దు నిర్ణయం’ పట్ల ఆ సంస్థ ‘విచారం’ వ్యక్తం చేసింది. భారత్ విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి ఒప్పందం రద్దుపై అధికారిక ప్రకటన తమకు చేరిందని రాఫెల్ అధికార ప్రతినిధి ఇషాయ్ డేవిడ్ బుధవారం తెలిపారు. రాఫెల్ సంస్థ రూపొందించిన యుద్ధ విమానాలు, అధునాతన ఆయుధాలు విశ్వవ్యాప్తంగా ఇప్పటికే 26 దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. అనేక విశే్లషణలు, పరిశీలనలు, నిబంధనలను పరిశీలించాక రాఫెల్ యుద్ధ విమానాలను కొనేందుకు భారత్ సుముఖత చూపింది. ఒప్పందం చేసుకోక ముందు, తాము అన్ని డిమాండ్లను తీర్చడానికి ముందు రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని రాఫెల్ ప్రతినిధి అన్నారు. భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖకు అన్ని విధాలా సహకారం అందించేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని ఆయన తెలిపారు. అధునాతన సాంకేతికతకు, విప్లవాత్మక సృజనకు తమ ఉత్పత్తులు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ఒప్పందం రద్దుకు కారణాలను మాత్రం రాఫెల్ సంస్థ వెల్లడించలేదు. ఈనెల 14 నుంచి నాలుగు రోజులపాటు ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహు పర్యటించబోతుండగా రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది.