అంతర్జాతీయం

ఆగ్నేయాసియాతో మరింత బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జనవరి 7: ఆగ్నేయ ఆసియా దేశాలతో మరింతగా బలమైన, విస్తృతమైన మైత్రీ బంధాన్ని పెంపొందించుకోవాలన్నదే తమ ఆశయమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవడం వల్లే ఆగ్నేయ ఆసియా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని సుష్మ అన్నారు. అలాగే ఆసియా ప్రాంత అభివృద్ధిలో ఆసియాన్ అత్యంత కీలకమైన అంతర్గమైన భాగమని స్పష్టం చేశారు. ప్రస్తుతం 16 భారత నగరాలు సింగపూర్‌తో అనుసంధానమయ్యాయని, అలాగే థాయిలాండ్‌తో బహుముఖ హైవే ప్రాజెక్టు కూడా మొగ్గుతొడుగుతోందని సుష్మ తెలిపారు.
మొత్తం ఆసియన్ దేశాలతోనే భారత్‌ను అనుసంధానం చేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆసియాన్-ఇండియా ప్రవాసీ భారతీయ దివస్‌లో సుష్మ అన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి ఆసియాన్ దేశాలకు, భారత్‌కు మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ వాణిజ్య ఒప్పందం అత్యంత విస్తృతమైన లక్ష్యాలతో కూడుకున్నదని, అలాగే భారత-ఆసియాన్ దేశాల మధ్య భాగస్వామ్య బంధం ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇది నిదర్శనమన్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంత విస్తృత స్థాయిలో సహకారం, సమన్వయం పెంపొందడానికి ప్రధాన కారణం- ఆచరణ యోగ్యమైన నియమ నిబంధనల విషయంలో ఉన్న స్పష్టతేనని సుష్మ తెలిపారు. భారత-ఆసియాన్ మధ్య ఇంకా విస్తృత స్థాయిలో సహకారం పెంపొందడానికి ఎంతో అవకాశం ఉందని, అలాగే ఇవి అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించే దేశాలు కలిగిన ప్రాంతమని సుష్మ తెలిపారు. ఆగ్నేయాసియాతో అనుసంధానం అయితే భారత్‌లోని ఈశాన్య ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందగలుగుతుందని సుష్మ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఆగ్నేయాసియాకు భారత్‌లోని ఈశాన్య ప్రాంతం ఎంతగా చేరవైతే భారత్-ఆసియాన్ దేశాల సంబంధాలు అంతగా బలపడతాయని, ఎంతగానో విస్తృతమవుతాయని తెలిపారు. డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, ఇంధన స్వచ్ఛతను సాధించడం, విజ్ఞానాన్ని ఉత్పాదక రీతిలో వ్యవసాయ రంగంలో అమలు చేయడం వంటి ఉమ్మడి అంశాలపై భారత-ఆసియాన్ దేశాలు ప్రధానంగా దృష్టి పెట్టాలని సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు.
చిత్రం..సింగపూర్‌లో ఆసియాన్-ఇండియా ప్రవాసీ భారతీయ దివస్‌లో ఓ రోబోతో కరచాలనం చేస్తున్న సుష్మాస్వరాజ్