అంతర్జాతీయం

డ్రగ్స్ కుంభకోణంలో మమతా కులకర్ణి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానె, జూన్ 18: సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల విలువ గల అంతర్జాతీయ మాదకద్రవ్యాల కుంభకోణంలో శనివారం మాజీ నటి మమతా కులకర్ణి పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్ బారన్ వికీ గోస్వామికి చెందిన ఈ మాదకద్రవ్యాల కుంభకోణంలో మమతా కులకర్ణి ప్రధాన నిందితురాలని థానె పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న మమతా కులకర్ణిని అప్పగించాలని కెన్యాను కోరనున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం కెన్యాలో ఉన్న మమతా కులకర్ణి, గోస్వామికి మధ్య సంబంధం ఉందని భావిస్తున్నారు. వీరిద్దరిని అప్పగించడానికి కెన్యాను కోరే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. ఇందులో తొలి చర్యగా ఇంటర్‌పోల్ ద్వారా వీరికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయనున్నట్టు పరంబీర్ సింగ్ తెలిపారు. ఈ మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన ఒక జంట నుంచి, అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ నుంచి సేకరించిన సమాచారంతో డ్రగ్ రాకెట్‌లో మమతా కులకర్ణి పాత్ర ధ్రువపడిందని ఆయన వివరించారు. రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్ రాకెట్‌లో మొత్తం 17 మంది నిందితులుండగా, వీరిలో ఏడుగురు ఇంకా పోలీసులకు చిక్కలేదని ఆయన తెలిపారు.
మిగతా పదిమందిని అరెస్టు చేయగా, వారు ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారని వివరించారు. కెన్యాకు ఎఫెడ్రిన్‌ను అక్రమ రవాణా చేస్తున్న షోలాపూర్‌లోని ఏవాన్ లైఫ్‌సైనె్సస్ లిమిటెడ్‌కు రెండు లక్షల వాటాలు ఉండగా, వాటిలో 11 లక్షల వాటాలను మమతా కులకర్ణికి కేటాయించడంతోపాటు కంపెనీ బోర్డులోకి కూడా ఆమెను తీసుకున్నారని సింగ్ వెల్లడించారు. కులకర్ణికి భారత్‌లో ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.