అంతర్జాతీయం

పెరూలో భూకంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీమా, జనవరి 14: పెరూలోని సముద్రతీర ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ సంఘటనతో పెరూతోపాటు పొరుగు ప్రాంతమైన చిలీలోనూ సునామీకి దారితీసే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ఒక ఏజన్సీ ప్రజలకు ఒక ప్రకటన ద్వారా హెచ్చరిక జారీ చేసింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప ప్రభావ తీవ్రత 7.3 ఉందని పేర్కొంది. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ఆకారీ ప్రాంతంలోని సౌత్-సౌత్‌వెస్ట్‌లో 42 కిలోమీటర్ల దూరంలో, సమద్రంలో 12.1 కిలోమీటర్ల లోతున ఆదివారం తెల్లవారుజామున 4.18 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు పేర్కొంది. అయితే, సముద్రతీరంలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ‘ది పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్’ హెచ్చరించింది. ఆ హెచ్చరిక ప్రకారం సునామీ తరంగాలు 0.3 మీటర్ల నుండి ఒక మీటరు వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. చిలీ తీర ప్రాంతాల్లో మాత్రం 0.3 మీటర్ల కంటే తక్కువగా సునామీ తరంగాలు ఉండొచ్చని తెలిపింది.