అంతర్జాతీయం

డోక్లామ్‌లో పనులు చట్టబద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 19: భారత్, చైనాల మధ్య డోక్లామ్ వివాదం మరోసారి రాజుకుంటోంది. ఇరు దేశాల సరిహద్దులోని డోక్లామ్ భూభాగం తమదేనని, అక్కడ సైనికుల కోసం తాము చేపట్టిన నిర్మాణాలన్నీ చట్టబద్ధమేనని చైనా సరికొత్త వాదన వినిపించింది. భారత్ పదే పదే అభ్యంతరం చెప్పినప్పటికీ, డోక్లామ్ వద్ద తాను చేపట్టిన సైనిక సముదాయం పనులను చైనా సమర్థించుకుంది. డోక్లామ్ వద్ద భారీ సైనిక సముదాయం నిర్మిస్తున్నట్టు శాటిలైట్ ఫొటోలు వెలుగులోకి రావడంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూ కాంగ్ స్పందించారు. ‘ఆ ఫొటోలు బయటకు ఎలా వచ్చాయో మాకు తెలియదు.. డోక్లామ్ ప్రాంతం ముమ్మాటికీ మాదే.. ఈ వైఖరిలో ఇకముందు కూడా మార్పు ఉండదు.. ఆ ప్రాంతంలో సైనికులు పహారా కాసేందుకు, ప్రజలు నివసించేందుకు భారీ నిర్మాణాలు చేపడుతున్నాం.. భవిష్యత్‌లో అక్కడ రోడ్ల నిర్మాణాలను సైతం చేపడతాం.. ఇవన్నీ చట్టబద్ధంగానే కొనసాగుతాయి..’ అని ఆయన వెల్లడించారు. భారత భూభాగంలో ఆ దేశం నిర్మాణాలు చేపడితే చైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయదని, అలాగే తమ భూభాగంలో తాము నిర్మాణాలు చేపడితే ఏ ఇతర దేశాలూ జోక్యం చేసుకోవని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. డోక్లామ్ వివాదాస్పద ప్రాంతమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై లూ కాంగ్ స్పందిస్తూ, ‘్భరత దళాలు సరిహద్దును దాటి వచ్చినట్లు ఆ దేశ సైనికాధికారి ఒకరు గుర్తించారు.. ద్వైపాక్షిక చర్చల ద్వారా డోక్లామ్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత చల్లారింది.. ఈ నేపథ్యంలో భారత్ గుణపాఠం నేర్చుకుంటుందని మేం భావిస్తున్నాం.. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని ఆశిస్తున్నాం..’ అని ఆయన పేర్కొన్నారు. డోక్లామ్ వద్ద సైనికుల కోసం హెలిపాడ్లు, కందకాలు, ఇతర నిర్మాణాలను చైనా భారీ ఎత్తున చేపడుతోందని ఆ దేశానికి చెందిన ఓ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు సైతం ఆ పత్రికలో రావడంతో మరోసారి డోక్లామ్‌పై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ఆరంభమైంది. ఆ కథనానికి సంబంధించి తన వద్ద ఎలాంటి వివరాలు లేవని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ చెప్పడం గమనార్హం.
సైనికుల అవసరాల కోసం భారీ సముదాయాలను నిర్మిస్తున్న సంగతి నిజమేనని, ఆ పనులన్నీ చట్టపరంగానే సాగుతున్నాయని ఆయన తెలిపారు. ‘డోక్లామ్ వద్ద మళ్లీ ఉద్రిక్తతలు నెలకొనాలని చైనా కోరుకుంటోందా?’ అని విలేఖరులు ప్రశ్నించగా, తాము చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులను అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలకు ఆటంకం కలిగిస్తాయని అన్నారు.