అంతర్జాతీయం

పాక్‌లో నకిలీ డిగ్రీల స్కాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 19: పాకిస్తాన్‌లో వెలుగుచూసిన నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్ల స్కామ్‌పై దర్యాప్తుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. పాకిస్తానీ సంస్థ ప్రమేయంతో ఈ కుంభకోణం నడవడంపై తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు ‘ఇది అత్యంత దిగ్భ్రాంతికరం. అలాగే జాతికే తీరని అవమానం’అని పేర్కొంది. వేలాది నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్లు బ్రిటన్ పౌరులకు విక్రయించడంపై చీఫ్ జస్టిస్ మియాన్ సాఖీబ్ నిసార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కంపెనీ పాల్పడ్డ ఈ నిర్వాకంపై పది రోజుల్లో నివేదిక అందజేయాలని ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ)ను కోర్టు ఆదేశించింది. ఈ స్కామ్ నిజమయితే జాతికే తీరని అవమానమని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బీబీసీ వార్తా కథనాల ప్రకారం పాకిస్తాన్ సంస్థ ఎగ్జాట్ బ్రిటిషర్లకు మూడువేలకు పైగా డిగ్రీ పట్టాలు విక్రయించింది. 2013-2014 మధ్యకాలంలో ఈ కుంభకోణం చోటుచేసుకుంది. పీహెచ్‌డీలు, డాక్టరేట్లూ విక్రయించినట్టు బీబీసీ వెల్లడించింది. ప్రపంచంలోనే పెద్ద ఐటీ కంపెనీగా చెప్పుకుంటూ ఎగ్జాట్ కంపెనీ డిగ్రీ సర్ట్ఫికెట్లు చలామణి చేసింది. ఊరూపేరూలేని బోగస్ యూనివర్శిటీలను సృష్టించి కరాచీలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్ ద్వారా ఈ నకిలీ భాగోతానికి తెరతీసిందని బీబీసీ బయటపెట్టింది. 2015లోనే ఎగ్జాట్ కంపెనీ నకిలీలలు బయటపడడంతో సీఈవో షోయబ్ షేక్, పలువురు ఉద్యోగులను అరెస్టు చేసి పాక్ చేతులు దులుపేసుకుంది. ప్రస్తుతం ఆ కేసు సింధ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. 2016 ఆగస్టులో షేక్ సహా 13 మంది నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బయటకు వచ్చిన సీఈవో ఏకంగా ఓ టీవీ చానల్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడు. ఇలా ఉండగా ఎగ్జాట్ వైస్‌ప్రెసిడెంట్ ఉమైర్ హమీద్‌ను నకిలీ డిగ్రీ పట్టాల కేసులోనే కోర్టు దోషిగా తేల్చింది.