అంతర్జాతీయం

ఉల్కలవల్లే భూమీదికి నీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోస్టన్, జనవరి 21: అసలు ఈ భూమీదికి జలసంపద ఎలా వచ్చిందన్నది సమాధానం లేని ప్రశ్నగానే ఖగోళవేత్తలను నిరంతరం వేధిస్తూనే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించి ఎడతెరిపి లేకుండా జరిపిన అధ్యయనాలు, పరిశోధనల ఫలితంగా తాజాగా ఓ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. సౌర వ్యవస్థ ఆవిర్భవించిన మొదటి 20 లక్షల సంవత్సరాల కాలంలోనే ఉల్కల కారణంగా భూమీదికి జల సంపద వచ్చిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ భూమీద జీవజాతి ఆవిర్భావానికి నీరు, కర్బనం వంటి మూలకాలే అత్యంత కీలకం కాబట్టి అసలీ మూలకాలు పుడమిపైకి ఎలా వచ్చాయన్నదానిపైన కూడా శాస్తవ్రేత్తలు దృష్టిపెట్టారు. తాజాగా వెలుగు చూసిన వాస్తవాల నేపథ్యంలో ఉల్కల తీరుతెన్నులపైనే తాము దృష్టిపెట్టామని, అనేక కోణాల్లో వీటిని లోతుగా గమనిస్తున్నామని వెల్లడించారు. సౌర వ్యవస్థ తొలిదశలో ఈ ఉల్కలు ఎలా ఉండేవి? ఎక్కడ ఉండేవి? వాటిలో ఎంత మేరకు జలసంపద ఉండేది అన్న దానిపైన అధ్యయన కోణాన్ని సారించినట్లు మసాచుసెట్స్ టెక్నాలజీ సంస్థ (ఎమ్‌ఐటి)కు చెందిన ఆడమ్ సరాఫియాన్ తెలిపారు. 4.56 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర వ్యవస్థ అంతర్భాగంలో ఆంగ్రైట్ అనే ఉల్కలు ఏర్పడ్డాయని, ఆ దశలో ఈ భూమి ప్రస్తుత దశకు 20 శాతం మాత్రమే ఉందని వెల్లడించారు. చాలా త్వరితగతిన అంగారక గ్రహం గ్రహ పరిమాణంలో ఏ మాత్రం మార్పు లేదని, ప్రస్తుతం అది ఏ పరిమాణంలో ఉందో అప్పుడు కూడా అలాగే ఉండేదని తెలిపారు. అలాగే మార్క్యురీ వీనస్ గ్రహాలు ఎంత త్వరితగతిన ఏర్పడ్డాయన్న దానిపై స్పష్టంగా ఏ విషయాన్నీ చెప్పలేమని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ఆంగ్రైట్ ఉల్కల్లో ప్రస్తుతం భూమిమీద ఉన్న జలసంపదలో 20 శాతం ఉండేదని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే సౌర వ్యవస్థ తొలిదశలో అంటే 4.56 బిలియన్ సంవత్సరాల క్రితమే జలసంపదన సమృద్ధిగా ఉండేదని స్పష్టమవుతోందని అన్నారు.