అంతర్జాతీయం

నలుగురు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జనవరి 21: దాదాపు 12 గంటలపాటు కాబూల్ హోటల్‌పై దాడి చేసి, దాన్ని దిగ్బంధం చేసిన సంఘటనకు ఆదివారం తెరపడింది. మిలిటెంట్లు జరిపిన దాడిలో ఓ విదేశీయుడు సహా ఆరుగురు మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. దాడి చేసిన నలుగురు మిలిటెంట్లను అఫ్గాన్ భద్రతా దళాలు హతమార్చాయని దేశీయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్ డానిష్ తెలిపారు. ఈ 12 గంటల దిగ్బంధ సమయంలో ఈ లగ్జరీ హోటల్‌లో ఉన్న టూరిస్టులు భయంతో పరుగులు పెట్టారని, బయటికి పారిపోవడానికి అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించారని ఆయన వెల్లడించారు. మొత్తంమీద ఈ దాడికి తెరదించామని, మృతుల్లో ఐదుగురు అఫ్గాన్ జాతీయులు కాగా, ఒక విదేశీయుడు కూడా ఉన్నారని దేశీయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజ్రత్ రహిమీ తెలిపారు. ఈ దిగ్బంధం తొలగించడంతోపాటు 40 మంది విదేశీయులు సహా మొత్తం 150 మంది రక్షించగలిగామని వెల్లడించారు. దాడి చేసినవారిలో చివరి ఆగంతకుడిని కూడా హతమార్చామని, హోటల్ ఆరవ అంతస్థులో ఈ విదేశీ మహిళ మృతదేహం కనిపించిందని ఆయన తెలిపారు. అయితే ఈ లగ్జరీ హోటల్‌పై జరిగిన దాడి ఇంకా సమసిపోలేదని ఇందులో నక్కిన మిలిటెంట్లు భద్రతా దళాలపై దాడులు చేస్తూనే ఉన్నారని అఫ్గాన్ గూఢచార సంస్థ ఏఎఫ్‌పీ వార్త సంస్థకు తెలిపింది. అంతర్జాతీయ ఇంటర్ కాంటినెంటల్ హోటళ్ల సముదాయంలో భాగమైన ఈ ఆరంతస్థుల లగ్జరీ హోటల్ నుంచి దట్టమైన పొగలు, మంటలు చెలరేగుతున్నట్లుగా టోలోన్యూస్ అనే చానల్ ప్రసారం చేసిన దృశ్యాలను బట్టి స్పష్టమవుతోంది. దుప్పట్లను ఉపయోగించి బాల్కనీ ద్వారా తప్పించుకునేందుకు అనేకమంది ప్రయత్నించిన దృశ్యాలను కూడా ఈ చానల్ ప్రసారం చేసింది. ఈ ప్రయత్నంలో పట్టుతప్పి ఓ వ్యక్తి కిందపడిన దృశ్యాన్ని కూడా ప్రసారం చేసింది. మొత్తం నలుగురు మిలిటెంట్లు శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ హోటల్‌లోకి చొరబడ్డారని, హోటల్ సిబ్బందిపైన, అతిథులపైన కాల్పులు జరుపుతూ అనేక మందిని బంధీలుగా చేసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ దాడికి తమదే బాధ్యత అంటూ ఏ మిలిటెంట్ సంస్థా ఇప్పటివరకూ ప్రకటించలేదు. 2011లో కూడా ఇదే హోటల్‌పై తాలిబన్ మిలిటెంట్లు దాడి చేసిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చిత్రం..ఉగ్రవాదుల దాడి అనంతరం కాబూల్‌లోని ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ నుంచి వెలువడుతున్న పొగ. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పొంచివున్న భద్రతా దళాలు