అంతర్జాతీయం

భళిరా భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 22: అంతర్జాతీయ ఆర్థిక ఫోరం (డబ్లుఈఎఫ్)వార్షిక భేటీకి వేదికైన దావోస్ భారతీయతతో మార్మోగిపోతోంది. ప్రపంచం నలు దిశల నుంచి వ్యాపార, వాణిజ్య దిగ్గజాలు తరలివస్తున్న దావోస్‌లో ఎటూ చూసినా ‘భారత్.. భారత్..’ అన్న నినాదాలతో కూడిన బిల్ బోర్డులు, లాంజ్‌లు భారత దేశం సాధించిన అభివృద్ధిని, భారత కంపెనీల ఖ్యాతిని చాటిచెప్పే రీతిలో నలుమూలలా కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులపైనే కాదు..చిన్నచిన్న సందులు కూడా భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేసిన లాంజ్‌లతో నిండిపోయాయి. 20 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈ వార్షిక సదస్సుకు హాజరు కావడం, ఈ మూడున్నరేళ్ల కాలంలో దేశ ఖ్యాతి, విఖ్యాతి ప్రపంచం నలుమూలలా విస్తరించడంతో అందరి దృష్టి భారత్‌పై కేంద్రీకృతమైంది. ఇంతలో ఇంత మార్పా అన్న ఆతృతా అందరిలోనూ కనిపిస్తోంది. భారతీయ ప్రగతికే కాదు..్భరతీయ వంటకాల ఘుమఘుమలూ అతిథుల
జిహ్వచాపల్యాన్నీ రేకెత్తిస్తున్నాయి. అన్నీ నిముషాల్లోనే ఎగిరిపోతున్నాయి. ముఖ్యంగా చాయ్, పకోడీలకు ఉన్న డిమాండ్ గురించి చెప్పనే అక్కర్లేదు. వడాపావ్, దోశల కోసమైతే ఎగబడుతున్నారు. అన్ని వీధులూ భారతీయ లాంజ్‌లతో నిండిపోవడంతో భిన్న రుచులకు కొదవ లేదు. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా సొంత లాంజ్‌లనే ఏర్పాటు చేశాయి. వీటితో పాటు భారతీయ కంపెనీల స్టార్టప్‌లూ ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా భారత్ కంపెనీలూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఆర్థిక సదస్సుకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాథాన్యత లభించింది. మంచు కూడా అన్ని చోట్లా దట్టంగానే కురుస్తోంది. సమావేశ తొలి రోజే చాలా రహదారులు మంచుతో మూసుకు పోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సారి ఉష్ణొగ్రత మైనస్ 30 డిగ్రీలు ఉన్నా ఈ వార్షిక సదస్సుకు హాజరయ్యే వారి సంఖ్యేమీ తగ్గలేదు. దాదాపు 70 దేశాలు, ప్రభుత్వాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానలులు హాజరు అవుతున్నందున భారీగానే భద్రతా బలగాలనూ తరలించారు. దాదాపు 30వేలకు పైగా ఉండే ప్రముఖులకు వసతి, భద్రత విషయంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది.
*
చిత్రం..దావోస్‌లో ఎటుచూసినా దర్శనమిస్తున్న నరేంద్ర మోదీ బ్రాండ్ హోర్డింగ్‌లు
*
దేశాలన్నిటి గమ్యపు
దశ-దిశలను నిర్ణయంచు దావోస్ భేటీ
రాశిని వాసిని పెంచెడి
ఆశాకిరణముగ మోది హాజరు మెరసెన్