అంతర్జాతీయం

దావోస్ సాక్షిగా విజయాల చిట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్, జనవరి 22: ఈ మూడేళ్ల కాలంలో భారత్ సాధించిన అభివృద్ధి విజయాలను ప్రపంచ ఆర్థిక ఫోరం వేదిక సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ నేతల కళ్లకు కట్టబోతున్నారు. జిఎస్టీ, పెద్దనోట్ల రద్దు సహా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో భారత ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చడంతోపాటు వృద్ధి, అభివృద్ధి, ఉపాధివంటి కీలకాంశాల విషయంలోనూ తాము సాధించిన విజయాలను మోదీ ప్రపంచ ఆర్థిక ఫోరం వేదిక ఆవిష్కరించనున్నారు. మంగళవారం జరిగే ప్లీనరీలో ఆయన మాట్లాడతారు. ఈ శిఖరాగ్ర సదస్సులో భాగంగా స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లాఫ్‌వెన్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మంగళవారం ప్రపంచ ఆర్థిక ప్రముఖులతో మోదీ సమావేశమవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘సంక్లిష్ట ప్రపంచ వాతావరణంలో భాగస్వామ్య భవిష్యత్ సృజన’ అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశం జరుగుతోంది. దావోస్ బయలుదేరే ముందు ఢిల్లీలో మాట్లాడిన మోదీ ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు బహుముఖీయంగా విస్తరించాయన్నారు. కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాలే కాకుండా అన్ని దేశాలతోనూ భారత్ ప్రజాసంబంధాలనూ పెంపొందించుకుంది. దాదాపు 20ఏళ్ల తరువాత ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననున్న తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ ఏమి చెప్పబోతున్నారన్నది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల్లో ఎనలేని ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
దాదాపు ప్రపంచ నేతలంతా కూడా భారత అభివృద్ధి విధానాల విషయంలో అనుసరించిన పద్ధతులను మోదీ ఆవిష్కరిస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షితవాదం, దేశీయత వంటి అంశాలను ఎదుర్కొనే విషయంలో భారత్‌కు ‘స్టేట్స్‌మన్’ హోదా కల్పించాలన్న డిమాండ్లూ తెరపైకి వచ్చాయి.

చిత్రం..ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం దావోస్‌కు చేరిన మోదీకి జ్యూరిచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం చెబుతున్న దృశ్యం