అంతర్జాతీయం

కారుబాంబు పేలుళ్లు 34 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంఘాజీ, జనవరి 24: లిబియాలో కారుబాంబు పేలుళ్లు 34 మందిని బలితీసుకున్నాయి. మసీదు నుంచి బయటకు వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. 34మంది చనిపోగా 87 మంది గాయపడ్డారు. బుధవారం సాయంకాలపుప్రార్థనలు ముగించుకుని వస్తుండగా తొలి కారు పేలుళ్లు సంభవించాయి. ఆ సమయంలో అక్కడ జనం గుమికూడగా మరో బాంబు పేలుడు సంభవించింది. 30 నిముషాల వ్యవధిలోనే రెండు కారు బాంబు పేలుళ్లు జరిగాయి. పేలుళ్లకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. నగరంలోకి అల్‌జలా ఆసుపత్రికి 25 మృతదేహాలను తీసుకొచ్చారు. గాయపడ్డ 51 మందికి ఇక్కడే చికిత్స చేస్తున్నట్టు అధికార ప్రతినిధి ఫదియా అల్-బర్ఘతి వెల్లడించారు. అలాగే బెంఘాజీ మెడికల్ సెంటర్‌లో తొమ్మిది మృతదేహాలుంచారు. గాయపడ్డ వారిలో 36 మందికి ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. మరోపక్క పేలుళ్లలో సైనిక అధినేత ఖలీఫా హఫ్తర్ భద్రతాధికారి అహ్మద్ అల్ ఫితూర్ చనిపోయారు. ఈ పేలుళ్లలపై ఐరాస తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.