అంతర్జాతీయం

మీ కృషి అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 24: అణ్వాయుధ వ్యాప్తి నిరోధంలో భారత్ చేస్తున్న కృషి అద్భుతమంటూ అమెరికా కితాబిచ్చింది. ఆస్ట్రేలియా గ్రూపులో సభ్యత్వాన్ని పొందినందుకు భారత్‌ను అభినందించింది. ట్రంప్ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఎంతో విలువనిస్తున్నామని, భారత్ తమకు అత్యంత సన్నిహితమైన, విలువైన మిత్ర దేశమని తెలిపింది. మానవాళి విధ్వంసానికి దారితీసే ఆయుధాల సముపార్జనను నిరోధించే దిశగా భారత్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ విషయంలో దాని అర్హతలు ప్రశంసనీయమని తెలిపింది. ఆస్ట్రేలియా గ్రూపులో భారత్ చేరడం అన్నది అణ్వాయుధ నిరోధక చర్యలకు మరింత బలాన్నిచ్చేదేనని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి హీదర్ న్యూరట్ తెలిపారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధన విషయంలో భారత్‌తో మరింత సన్నిహితంగా కలిసి పని చేయడానికి ఆస్ట్రేలియా గ్రూపులో దాని సభ్యత్వం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఇరు దేశాలది ఈ విషయంలో ఒకే లక్ష్యమని, దాన్ని సాధించేందుకు కలిసిగట్టుగా పనిచేసే అవకాశం మరింత బలపడిందన్నారు. ఈ అంశంపై మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ మొదటినుంచీ కూడా భారత్ అణ్వాయుధ వ్యాప్తి నిరోధనకు అంకితభావంతో కృషి చేస్తోందని, ఆస్ట్రేలియా గ్రూపులో సభ్యత్వం రావడం ఇందుకు నిదర్శనమని అన్నారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్న అనేక అంతర్జాతీయ గ్రూపుల్లో భారత్ ఇప్పటికే సభ్యత్వం పొందిందని పేర్కొన్న ఆయన, ఈ రెండేళ్ల కాలంలో ఎటీసీఆర్, వెసనార్ అరేంజ్‌మెంట్ తాజాగా ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత్ చేరడం దాని చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. ప్రపంచ శాంతి భద్రతలే లక్ష్యంగా భారత్ మొదటినుంచీ అంకితభావంతో కృషి చేస్తుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఇతర సభ్య దేశాలకూ కృతజ్ఞతలు తెలిపారు.