అంతర్జాతీయం

పద్మావత్‌కు ‘నో’ కట్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 25: సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద ‘పద్మావత్’ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా పాకిస్తాన్ సెన్సార్‌బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్ మొబాషీర్ హసన్ ఎలాంటి కట్స్ లేకుండా పాక్‌లో విడుదలకు అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పద్మావత్ చిత్రంలో ఎక్కడా ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా థియేటర్లలో ప్రదర్శించుకునేందుకు ‘యు’ సర్ట్ఫికెట్‌ను బోర్డు మంజూరు చేసింది. ఈ మేరకు హసన్ తన ట్విట్టర్‌లో ప్రకటించారు. ఢిల్లీ పాలకుడు, ముస్లిం రాజైన అల్లాఉద్దీన్ ఖిల్జీని ప్రతినాయకుడి పాత్రలో చూపిస్తూ సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ని రూపొందించారు. భారత్‌లో ఈ చిత్రంపై ఓ వర్గం తీవ్రంగా విరుచుకుపడింది. సెన్సార్‌బోర్డులోనూ అభ్యంతరాలు వచ్చాయి. అతి కష్టంపై గురువారం చిత్రాన్ని విడుదల చేశారు. అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్ర వల్ల పాకిస్తాన్‌లో పద్మావత్ విడుదలకు ఇబ్బందులు వస్తాయని దర్శక, నిర్మాతలు భయపడ్డారు. ‘సీబీఎఫ్‌సీ కళను గౌరవిస్తుంది. చిత్రంలోని సృజనాత్మకత, వినోదానికి ప్రాధాన్యత ఇచ్చాం’ అని చైర్మన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పద్మావత్ చిత్రం పాకిస్తాన్ మేధావుల ప్రశంసలు అందుకుంది. ఇస్లామాబాద్‌లోని ఖయిద్-ఏ- అజామ్ వర్శిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ వఖార్ అలీ షా మాట్లాడుతూ ‘పద్మావత్‌లో అనేక చారిత్రక అంశాలున్నాయి’ అన్నారు. ఇలాంటి చిత్రాలను ఆదరించాలని పలువురు వ్యాఖ్యానించారు.