అంతర్జాతీయం

ఆ రెంటిపైనా చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 26: కాశ్మీర్ సమస్యతో పాటు కొత్తగా రోహింగ్యాల సంక్షోభం తలెత్తడానికి ప్రపంచ దేశాల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఈ రెండు అంశాలపై అంతర్జాతీయ వేదికపై చర్చ జరగాలని పాక్ డిమాండ్ చేసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాహిద్ ఖాఖన్ అబ్బాసీ కేబినెట్ సహచరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. చైనాతోపాటు అమెరికాతోనూ తాము సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. బెల్ట్, రోడ్ ఇనిషియేటీవ్(బీఆర్‌ఐ), ఎకనామిక్ కారిడార్‌లు చైనా సహాయ, సహకారాలతోనే చేపట్టిన సంగతి తెలిసిందే. చైనాతోగల సంబంధాలపై అడిగిన ప్రశ్నకు పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసీఫ్ బదులిస్తూ‘కాశ్మీర్ సమస్యతోమాటు రోహింగ్యాల అంశం కూడా కీలకమైనవే వాటిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చను మేం కోరుకుంటున్నాం’అని చెప్పారు. అలాగే అన్ని దేశాలతోనూ పాక్ సత్సంబంధాలు కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. పాక్ పుట్టినప్పటి నుంచి చైనా, అమెరికాలతో మైత్రి కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.