అంతర్జాతీయం

భారత హైకమిషనర్‌తో విజయ్ మాల్యా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 18: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా గురువారం సాయంత్రం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో ప్రముఖ సామాజికవేత్త సుహెల్ సేథ్ నూతన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దర్శనమిచ్చాడు. బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ నవ్‌తేజ్ సర్నా ప్రత్యేక అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో విజయ్ మాల్యా దర్శనమివ్వడం స్వదేశంలో పెను దుమారాన్ని రేపుతోంది. మనీ లాండరింగ్ కేసులో నేరస్థుడిగా ముద్ర పడిన మాల్యా అరెస్టుకోసం భారత్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే మాల్యా పాల్గొన్న ఈ కార్యక్రమానికి భారత హైకమిషనర్ కూడా హాజరుకావడం అనేక సందేహాలను లేవనెత్తుతోంది. సుహెల్ సేథ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాల్యా, నవ్‌తేజ్ సర్నా పాల్గొన్న దృశ్యాలను వార్తా చానళ్లు ప్రసారం చేయడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అయితే, ఇది బహిరంగ కార్యక్రమమని, కనుక దీనికి ఎవరైనా హాజరుకావచ్చని సుహెల్ సేథ్ పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి విజయ్ మాల్యాను ఆహ్వానించలేదని, ఈ కార్యక్రమానికి మాల్యా కూడా హాజరు కాలేదని సేథ్ తెలిపాడు.
కాగా, ఈ అంశంపై వివరణ ఇస్తూ విదేశీ వ్యవహారాల శాఖ కూడా ప్రకటన జారీ చేసింది. పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిన ఎల్‌ఎస్‌ఇ హాల్‌లో ప్రేక్షకుల మధ్య మాల్యా కనిపించిన వెంటనే నవ్‌తేజ్ సర్నా తన ప్రసంగాన్ని ముగించడంతోపాటు చర్చాగోష్ఠి కార్యక్రమం ఆగకుండా వేదిక దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమమంతా రెండు భాగాలుగా జరిగిందని, వీటిలో బ్రిటన్ మంత్రి జో జాన్సన్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ, ఎల్‌ఎస్‌ఇలో చర్చాగోష్ఠి మొదటి భాగం కాగా, ఆ తర్వాత ఎంపిక చేసిన కొంతమంది అతిథులకు భారత హైకమిషన్‌లో విందు ఇవ్వడం రెండవ భాగమని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఎల్‌ఎస్‌ఇలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాల జాబితాను ఎల్‌ఎస్‌ఇయే ఖరారు చేసినప్పటికీ ఆ జాబితాను భారత హైకమిషనర్‌కు కూడా పంపారని, అందులో విజయ్ మాల్యా పేరు లేదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.